వైసీపీ బలం, బలహీనతలివే ..ఒక్క ట్వీట్లో తేల్చేసిన విజయసాయిరెడ్డి..!

ఏపీలో నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుని మరో ఏడాదిలోపే ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార వైసీపీ బలాబలాల విషయంలో రాష్ట్రంలో చర్చ జరుగుతూనే ఉంది. వైసీపీ ఎంతో బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు సాధిస్తామంటూ అధికార పార్టీ నేతలు బల్లగుద్ది చెబుతుండగా.. విపక్షాలు మాత్రం అంత సీన్ లేదని, ఈసారి గెలుపు తమదేనని చెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు ఇరువురికీ కీలకంగా మారిపోయాయి. ట

ఈసారి ఏపీలో హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాల మధ్య వైసీపీ బలాబలాల గురించి ప్రస్తావిస్తూ అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్ చేశారు.ఇందులో విపక్షాలకు ఉన్నదేంటి, వైసీపీకి లేనిదేంటో చెప్పేశారు. ఇన్నాళ్లు వైసీపీ నేతలు చెప్పుకుంటున్న అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూనే మరోవైపు విపక్షాల బలం పేరుతో తమ బలహీనతను ఎంపీ సాయిరెడ్డి బయటపెట్టారు. దీంతో ఇప్పుడు ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది.

vijaysaireddy

ఏపీలో విపక్షాలకు ఉన్నదేంటో చెబుతూ సాయిరెడ్డి ట్వీట్ మొదలుపెట్టారు. ఏపీలో వారికి మీడియా ఉందని, ధనబలం ఉందని, ప్రచార యంత్రాంగం ఉందని, పథక రచన చేసేందుకు తగినంత సమయం ఉందని, వ్యవస్ధల్ని ఎలా ఏమార్చాలో వారికి తెలుసని, వారికి లేనిదేమీ లేదంటూ విపక్షాల్ని ఆకాశానికెత్తేశారు సాయిరెడ్డి. తద్వారా ఇవన్నీ వైసీపీకి లేవని పరోక్షంగా చెప్పేశారు. అలాగే వైసీపీ బలమేంటో కూడా సాయిరెడ్డి వెల్లడించారు.

విపక్షాలకు ఇవన్నీ ఉండొచ్చని, తమకు మాత్రం తాను ఎవరికోసం అయితే పనిచేస్తున్నామో ఆ ప్రజలు ఉన్నారని, వారి కోసం ఏమైనా చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. గతంలో సీఎం జగన్ కూడా పదే పదే బహిరంగసభల్లో ఇదే విషయం స్పష్టం చేశారు. విపక్షాలకు మీడియా సహా అందరి అండా ఉందని, తనకు మాత్రం కేవలం ప్రజల అండ ఉందని జగన్ పలుమార్లు చెప్పారు. ఇదే విషయం మరోసారి సాయిరెడ్డి తన ట్వీట్ లో పునరుద్ఘాటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+