ఫలితాలు: కేంద్రంపై ఎంపీల అవిశ్వాస నోటీస్, 6గురు సైన్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. సొంత పార్టీ ప్రభుత్వం పైన వారు అవిశ్వాసం నోటీసును సభాపతికి ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో యూపిఏ 2 ప్రభుత్వం సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీలు అవిశ్వాసం పెట్టాలని నిర్ణయానికి వచ్చారు.
వారు స్పీకర్ మీరా కుమార్‌కు అవిశ్వాసం నోటీసును సోమవారం మధ్యాహ్నం అందజేశారు. ఈ నోటీసు పైన ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీలు సంతకాలు చేశారు. సంతకాలు చేసిన వారిలో లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్, రాయపాటి సాంబశివ రావు, సబ్బం హరి, సాయి ప్రతాప్‌లు ఉన్నారు. అవిశ్వాసం నోటీసు పైన వారు సంతకాలు చేసిన అనంతరం ఎంపి సబ్బం హరి దానిని స్పీకర్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా సబ్బం హరి మాట్లాడుతూ... సమైక్య రాష్ట్రం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు సంఖ్యతో పని లేదన్నారు.198 నిబధన ప్రకారం తాము అవిశ్వాస నోటీసును ఇచ్చామన్నారు. మరోవైపు అవిశ్వాసం కోసం 55 మంది మద్దతును కూడా కూడగట్టే ప్రయత్నాలు వారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
రాజీనామాలు వెనక్కి
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయానికి వచ్చిన అనంతరం ఎంపీలు తమ రాజీనామాలను ఉపసంహరించుకున్నారు.












Click it and Unblock the Notifications