వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ జిల్లాలో ఏ పార్టీ: తెరాసVsకాంగ్రెస్, టిడిపికీ గాలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రాదేశిక ఎన్నికల ఫలితాలలో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెసు పార్టీల మధ్య కొంత పోటీ కనిపిస్తున్నప్పటికీ.. తెరాస కొంత ముందంజలో ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ పరువు కాపాడుకుంటోంది. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు తెలంగాణలోని పది జిల్లాల్లో తెరాస 247, కాంగ్రెసు పార్టీ 242, టిడిపి 108 స్థానాలలో గెలుపొందాయి.

అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తెరాస, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెసు, ఖమ్మం జిల్లాలో టిడిపి ముందంజలో ఉంది. వరంగల్ జిల్లాలో కాంగ్రెసు, టిడిపిలో చెరి రెండు స్థానాల్లో, తెరాస నాలుగు స్థానాల్లో గెలిచింది.

MPTC and ZPTC election results in Telangana

నిజామాబాద్‌లో తెరాస 61, కాంగ్రెస్ 47, టిడిపి 8, అదిలాబాద్‌లో తెరాస 79, కాంగ్రెస్ 43, టిడిపి 26, కరీంనగర్‌లో తెరాస 53, కాంగ్రెస్ 34, టిడిపి 5, వరంగల్‌లో తెరాస 4, కాంగ్రెస్ 3, టిడిపి 2, ఖమ్మంలో తెరాస 0, కాంగ్రెస్ 8, టిడిపి 31, మహబూబ్ నగర్‌లో తెరాస 1, కాంగ్రెస్ 8, టిడిపి 2, రంగారెడ్డిలో తెరాస 24, కాంగ్రెస్ 56, టిడిపి 27, మెదక్‌లో తెరాస 13, కాంగ్రెస్ 22, టిడిపి 2, నల్గొండలో తెరాస 12, కాంగ్రెస్ 21, టిడిపి 5 స్థానాల్లో గెలుపొందాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వగ్రామంలో తెరాస అభ్యర్థి గెలుపొందారు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చింతమడకలో తెరాస తరఫున పోటీ చేసిన దేవమ్మ భారీ మెజార్టీతో గెలుపొందారు.

English summary
MPTC and ZPTC election results in Telangana region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X