నువ్వా - నేనా సై, మారుతున్న లెక్కలు: అసలు పరీక్ష.. నేడే..!!
స్థానిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తు న్నాయి. కూటమి - వైసీపీ ఈ ఎన్నికల్లో హోరా హోరీగా తల పడుతున్నాయి. రెండు వైపులా వీటి ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ చోటు చేసుకున్న ఘటన ల పైన రాజకీయంగా ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అసలు సిసలు పరీక్ష మొదలు కానుంది. నేటి నుంచే ఇందుకు ముహూర్తం ఖరారైంది.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ రోజు నామినేషన్ల పరిశీలన చేస్తున్నారు. ఈ నెల 21న నామినేషన్ల ఉపసంహరణ... 28న పోలింగ్.. 30న కౌంటింగ్ జరగనుంది. కాగా.. ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఈ రోజు మరో సమరం ప్రారంభం కానుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 27వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజుగా ఖరారు చేసారు. కాగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 3న జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ నోటిఫికేషన్ 28 జిల్లాలకు చెందిన జిల్లా పరిషత్‌లు, 662 జెడ్పీటీసీ నియోజకవర్గాలు, 9,983 ఎంపీటీసీల కు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్లను ప్రత్యక్ష ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు.

నేడే నోటిఫికేషన్
రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద, బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలిచ్చారు. ఇప్పటికే వెండర్‌ను ఎంపిక చేశారు. 20లోపు కెమెరాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి అవుతుంది. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది శిక్షణ కూడా పూర్తయింది. అయితే.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చోటు చేసుకుంటున్న ఘటన లు.. ఎన్నికల సంఘం పైన వచ్చిన ఆరోపణలతో కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. మున్సిపల్ కంటే ఒక విధంగా ఈ ఎన్నికలను పార్టీలు మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం.. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు కావటంతో పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications
