సడన్ గా పులివెందులకు జగన్ - ఏకగ్రీవాల వేళ మారిన వ్యూహం..!!

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. పలు చోట్ల వైసీపీ నామనేషన్లు దాఖలు కాలేదు. దాదాపు ఎనిమిది మున్సిపాల్టీలు ఏకగ్రీవం కావటం ఖాయంగా కనిపిస్తోంది. మాజీ సీఎం జగన్ నామినేషన్ల ప్రక్రియలో చోటు చేసుకున్న ఘటనల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. నేరుగా గవర్నర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. కాగా.. ఈ నెల 21న జగన్ పులివెందుల పర్యటన ఖరారైంది. నామినేషన్ల సమయంలో గాయ పడిన కార్యకర్తల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.

నామినేషన్ల ప్రక్రియ వేళ జగన్ సొంత జిల్లా కడపలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పులివెందుల సహా జిల్లాలో పలు మున్సిపాల్టీలు టీడీపీకి ఏకగ్రీవం కానున్నాయి. వైసీపీ స్థానిక నేతలు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు. టీడీపీ శ్రేణుల దాడులు.. పోలీసుల సహకారం తో అడ్డుకున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. చోటు చేసుకున్న ఘర్షణల్లో పలువురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో.. జగన్ పులివెందులకు వెళ్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, పులివెందులలో జరిగిన పరిణామాలపై సమీక్షించనున్నారు. భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలతో భేటీ అవుతారు. 22న లింగాల మండలం ఇప్పట్ల వెళ్తనున్నారు. తిరిగి పులివెందుల చేరుకొని పార్టీ శ్రేణులతో భేటీ అవుతారు.

ఎనిమిది మున్సిపాల్టీలు కూటమికి ఏకగ్రీవం, లిస్టులో- అక్కడే బిగ్ ట్విస్ట్..!!
ఎనిమిది మున్సిపాల్టీలు కూటమికి ఏకగ్రీవం, లిస్టులో- అక్కడే బిగ్ ట్విస్ట్..!!
ysrcp-chief-ys-jagan-to-visit-pulivendula-to-console-injured-party-cadre-during-the-nominations-her

పులివెందులలో రెండు రోజులు మకాం

కాగా, నామినేషన్ల ప్రక్రియలో గాయపడిన వారిని పరామర్శించాలని జగన్ నిర్ణయించారు. ముందు గా పులివెందుల ఆ తరువాత మిగిలిన నియోజకవర్గాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ నెల 28న పోలింగ్ ఉండటంతో కేడర్ లో ధైర్యం చెప్పేందుకు జగన్ పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. అదే విధంగా ఈ రోజు జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మున్సిపల్ కంటే ఈ ఎన్నికలను పార్టీలు మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిణామాల వేళ జగన్ తన సొంత జిల్లా నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవాలని జగన్ సూచిస్తున్నారు. కాగా.. తాజా పరిణామాల పై సుప్రీంకోర్టులో వైసీపీ ఈ రోజు పిటీషన్ దాఖలు చేస్తోంది. పులివెందుల పైన టీడీపీ గురి పెట్టటంతో పోలింగ్ ముందు జగన్ పర్యటన రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+