పసిడి ధరలకు పండగ కొనుగోళ్ల ఊతం- అప్ ట్రెండ్

అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం భారత్‌లోని బులియన్ మార్కెట్‌పై క్రమం తప్పకుండా పడుతూ వస్తోంది. బంగారం, వెండి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్నాయి. వీటి దెబ్బకు నేడు కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇది స్వల్పమే. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన వివాదాల కారణంగా ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

పండగల సీజన్ లో కొనుగోళ్లు క్రమంగా పెరుగుతోండటం కూడా బంగారానికి ఊతమిచ్చినట్టవుతోంది. ఫలితంగా దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌లోనూ పసిడి ధరలు పాజిటివ్ గా సాగుతున్నాయి. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ లో నేడు పసిడి ధర 0.20 శాతం పెరిగి 10 గ్రాములకు 1,48,580 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. అదే సమయంలో వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్టులు 0.44 శాతం మేర లాభపడి కిలోకు రూ. 2,12,770 వద్ద కొనసాగాయి.

gold-and-silver-in-india-domestic-raised-marginally-amid-heightened-tensions-between-the-us-and-iran

శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల ధరలో రూ. 380, 22 క్యారెట్లు రూ. 350, 18 క్యారెట్లు రూ. 290 మేర పెరిగాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,610, 22 క్యారెట్లు రూ. 1,36,226 గా రికార్డయ్యాయి. ఇక్కడ వెండి కిలో రూ. 2,12,940 గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ. 1,48,810, 22 క్యారెట్లకు రూ. 1,36,409 కాగా వెండి 2,13,220 వద్ద ట్రేడ్ అయింది.

టైగర్ ష్రాఫ్ కరేజ్..: తానే కారు డ్రైవ్ చేస్తూ డ్రైవర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాడు
టైగర్ ష్రాఫ్ కరేజ్..: తానే కారు డ్రైవ్ చేస్తూ డ్రైవర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాడు

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,48,370, రూ. 1,36,006 కాగా వెండి కిలో రూ. 2,12,610 వద్ద స్థిరపడ్డాయి. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,48,490, 22 క్యారెట్లు రూ. 1,36,116, వెండి రూ. 2,12,770 వద్ద స్థిరపడ్డాయి.

కాల్పుల్లో గాయపడ్డ టైగర్ ష్రాఫ్ ఫస్ట్ ఫొటో: డిప్యూటీ సీఎం రాక.. !!
కాల్పుల్లో గాయపడ్డ టైగర్ ష్రాఫ్ ఫస్ట్ ఫొటో: డిప్యూటీ సీఎం రాక.. !!

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,804, 22 క్యారెట్లు - రూ. 13,570, 18 క్యారెట్లు - రూ. 11,155

ముంబై..

24 క్యారెట్లు- రూ. 14,804, 22 క్యారెట్లు - రూ. 13,570, 18 క్యారెట్లు - రూ. 11,103

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 14,804, 22 క్యారెట్లు - రూ. 13,570, 18 క్యారెట్లు - రూ. 11,103

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 14,804, 22 క్యారెట్లు - రూ. 13,570, 18 క్యారెట్లు - రూ. 11,103

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 14,804, 22 క్యారెట్లు - రూ. 13,570, 18 క్యారెట్లు - రూ. 11,103

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 14,804, 22 క్యారెట్లు - రూ. 13,570, 18 క్యారెట్లు - రూ. 11,103

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+