ఎనిమిది మున్సిపాల్టీలు కూటమికి ఏకగ్రీవం, లిస్టులో- అక్కడే బిగ్ ట్విస్ట్..!!

ఏపీలో మున్సిపల్ నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఘర్షణలు.. దాడులతో రాయలసీమ లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ - వైసీపీ శ్రేణులు పలు ప్రాంతాల్లో తలపడ్డాయి. ఎనిమిది మున్సిపాల్టీలు కూటమికి ఏకగ్రీవం కావటం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల సంఘం అధికారికం గా ప్రకటించాల్సి ఉంది. నామినేషన్ల నిర్వహణ తీరు పైన వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మాజీ సీఎం జగన్ గవర్నర్. .ఎస్ఈసీకి ఫిర్యాదు చేసారు. ఇక.. ఈ రోజు జెడ్పీటీసీ- ఎంపీటీసీల ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది.

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 17 కార్పోరేషన్లలో నాలుగు చోట్ల ఎన్నికలు జరగటం లేదు. 13 కార్పోరేషన్లలో నామినేషన్లకు దాఖలయ్యాయి. ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఇక.. మున్సిపాల్టీల్లో ఎనిమిది చోట్ల కూటమికి ఏకగ్రీవం అవుతున్నాయి. దర్శి విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కడప, అన్నమయ్య, పల్నాడు జిల్లాలోని ఈ మున్సిపాల్టీల్లో వైసీపీ నామినేషన్లు దాఖలు చేయలేకపోయింది. తమను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని.. పోలీసులు సైతం వారికి మద్దతుగా నిలిచారని మాజీ సీఎం జగన్ నేరుగా గవర్నర్, ఎస్ఈసీని కలిసి ఫిర్యాదు చేసారు. హైకోర్టులోనూ పిటీషన్ దాఖలు చేసారు. అయితే, కోర్టు పిటీషన్ తోసి పుచ్చింది. దీంతో.. నామినేషన్ల సమయం పూర్తి కావటంతో ఉద్రిక్తతల నడుమే ఎనిమిది మున్సిపాల్టీల్లో ఏకగ్రీవం అయినట్లు స్పష్టం అవుతోంది.

PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం మార్పు, తాజా అప్డేట్..!!
PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం మార్పు, తాజా అప్డేట్..!!
alliance-set-to-win-eight-municipalities-unopposed-as-ycp-did-not-files-nominations-here-the-detail

21న అధికారిక ప్రకటన

కాగా, ఈ రోజు నేడు నామినేషన్ పత్రాల స్క్రూటినీ జరగనుంది. ఈ నెల 21న నామినేషన్ల ఉపసం హరణల తర్వాత మున్సిపల్ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. వైసీపీ నామినేషన్లు దాఖలు చేయనిదర్శి, పిడుగురాళ్ల, ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి, పుంగనూరు పురపాలక సంఘాలు, గురజాల, కమలాపురం నగర పంచాయతీల్లో ఛైర్పర్సన్ ఎన్నికలు కూటమి పార్టీలకు ఏకగ్రీవం అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. కడప జిల్లా జమ్మలమడుగు, అనంతపురం జిల్లా గుత్తిలో వైకాపా ప్రకటించిన అధికారిక అభ్యర్థులు కాకుండా డమ్మీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.అయితే.. దర్శిలో మొత్తం ఐదు నామినేషన్లు దాఖలుకాగా, అందులో జనసేన పార్టీ తరఫున మూడు, టీడీపీ తరఫున ఒకటి, ఇండిపెండెంట్‌ ఒకటి ఉన్నాయి. కూటమి పొత్తులో భాగంగా దర్శి మున్సిపాలిటీని జనసేనకు కేటాయించారు. జనసేన పార్టీ నుంచి దారం సుబ్బారావు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. ఆయనకు మద్దతుగా టీడీపీ, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ వేయలేదు. దీంతో టీడీపీ, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్న తర్వాత ఏకగ్రీవం పైన ప్రకటన రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+