దసరా వేళ శుభవార్త.. రూ.2,500 కోట్లతో రాష్ట్రవ్యాప్త ఆలయాల ఆధునీకరణ!

తెలంగాణా రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ పడుతోంది. దసరా పండుగ వేళ రాష్ట్రంలోని ఆలయాలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం రూ.2,500 కోట్లు కేటాయించి పనులు చేపడుతున్నట్లు తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్‌తో కలిసి ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, నాచారం శ్రీ అద్భుత వేంకటేశ్వరస్వామి ఆలయాలను సందర్శించారు.

ఏన్కూరు నుంచి నాచారం కొండ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి రూ.44 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఈ రహదారి పూర్తయితే భక్తులు సులభంగా ఆలయానికి చేరుకోవచ్చని, స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ.276 కోట్లు, బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయానికి రూ.354 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు జరుపుతున్నట్లు తెలిపారు.

Telangana temple modernisation goodnews on dussehra Rs 2 500 Crore for Temple Modernisation

ఆర్థికమంత్రిగా తానే ఈ నిధులు కేటాయించడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకున్నారు. గోదావరి పుష్కరాలకు సన్నాహకంగా నదీ తీర ప్రాంతాలు, అక్కడి ఆలయాల అభివృద్ధికి సుమారు రూ.2,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా స్పష్టం చేశారు.

ప్రభుత్వం కేవలం పెద్ద ఆలయాలకే పరిమితం కాకుండా చిన్న, మధ్యతరహా దేవాలయాలను కూడా అభివృద్ధి చేస్తోంది. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి అదనంగా నిధులు, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో టీటీడీ నిధులతో మండపం, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం, యాదగిరిగుట్టలో వేద పాఠశాలతో పాటు వివిధ సౌకర్యాల కోసం కోట్లాది రూపాయలు కేటాయించిన విషయాలు గమనార్హం.

మెడారం జాతరకు ముందు గద్దెల విస్తరణ, సౌకర్యాల మెరుగుదలలో కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ చర్యలు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంచి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని అధికారులు భావిస్తున్నారు. సభలో మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని భట్టి అన్నారు. మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాల చెక్కులు అందించారు.

ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కొరత ఏర్పడకుండా ప్రతి చుక్కను పొదుపుగా వినియోగించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నాచారం నుంచి ఉమ్మడి జిల్లాలను కలుపుతూ జూలూరుపాడు వరకు రహదారి మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరగా, మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆలయాల అభివృద్ధితో పాటు రహదారులు, నీటి సౌకర్యాలు, మహిళా సాధికారత కార్యక్రమాలు ఏకకాలంలో సాగడం ప్రభుత్వ సమగ్ర అభివృద్ధి దృక్పథాన్ని సూచిస్తోందని అన్నారు.

వాటర్ వేస్ట్ చేస్తున్నారా? అయితే భారీ ఫైన్లకు రెడీగా ఉండండి!
వాటర్ వేస్ట్ చేస్తున్నారా? అయితే భారీ ఫైన్లకు రెడీగా ఉండండి!

భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా, ఆలయాల చుట్టూ ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చేస్తున్న ఈ ప్రయత్నాలు తెలంగాణలో ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఒరవడి తీసుకురాగలవని నాయకులు, స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+