వైసీపీలో చేరుతున్నా - ఎన్నికల్లో గెలుపుపై ముద్రగడ కీలక వ్యాఖ్యలు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. కూటములు ఖరారయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ వామపక్షాలతో జత కట్టింది. వైసీపీ సింగిల్ గా బరిలోకి దిగుతోంది. ఇదే సమయంలో గోదావరి జిల్లాల్లో రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ తన రాజకీయ నిర్ణయం ప్రకటించారు. వైసీపీలో చేరటం పైన స్పష్టత ఇచ్చారు. ఎన్నికల పైనా కీలక వ్యాఖ్యలు చేసారు.
ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ముద్రగడ స్వయంగా ప్రకటన చేసారు. ఈ నెల 14న తన కుమారుడితో సహా వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. తాను ఎలాంటి పదవులు ఆశించటం లేదని పేర్కొన్నారు. భగవంతుడు దయవల్ల మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి గా గెలిస్తే ఆయన ఏ పదవి ఇచ్చినా తీసుకునేందుకు సుముఖంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గోంటానని స్పష్టం చేసారు. దీంతో, కొంత కాలంగా ముద్రగడ వైసీపీలో చేరటం పైన జరుగుతున్న చర్చ పైన స్పష్టత వచ్చింది.

సిఎం వైఎస్ఆర్ జగన్ సమక్షంలో నేను , నా కుమారుడు గిరి పార్టీ లో చేరతాం..!#MudragadaPadmanabham #CMYSJagan #YSJagan #YSJaganAgain #YSRCP #Elections2024 #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/i0Bzsf83fO
— oneindiatelugu (@oneindiatelugu) March 10, 2024
ముద్రగడ పద్మనాభం వైసీపీ నుంచి పవన్ కల్యాణ్ పైన పోటీ చేస్తారని ప్రచారం సాగింది. పిఠాపురం నుంచి పోటీలో నిలుస్తారని భావించారు. అయితే, ముద్రగడ ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టత ఇచ్చారు. ముద్రగడ గతంలో కాకినాడ ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేసారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంటానని చెబుతూనే...ఎన్నికల్లో మాత్రం పోటీ చేయటం లేదని వెల్లడించారు. ఇక, గోదావరిలో ఈ సారి పవన్ కల్యాణ్ కాపు ఓట్ బ్యాంక్ తన వైపు తిప్పుకుంటారనే అంచనాలు ఉన్నాయి. దీంతో, ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరటం ద్వారా కాపు ఓట్ బ్యాంక్ పైన గురి పెట్టింది. ఇప్పటికే చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరారు. ఇక, ముద్రగడ వైసీపీలో చేరిన తరువాత గోదావరి రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ అధికారంలోకి వస్తే ముద్రగడను రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications