మనవడ్ని పిఎం, మునిమనవడ్ని అమెరికా అధ్యక్షుడు: బాబుపై ముద్రగడ సెటైర్లు
భీమవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులను రాజకీయ వారసులుగా చేసుకోవటానికి ప్రణాళికలు వేసుకుంటున్నారని కాపు నేత ముద్రగడ పద్మనాభం విమర్శంచారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలోని కరుకువాడ బేతపూడి గ్రామంలో వంగవీటి రంగ విగ్రహాన్ని ముద్రగడ ఆవిష్కరించారు.
ఆ తర్వాత ప్రసంగించారు. చంద్రబాబు కొడుకు మంత్రి కాగా, మనవడిని ప్రధానమంత్రి, మునిమనవడిని అమెరికా అధ్యక్షుడిగా చేయాలని అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే కాపుల బాధలు పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు.

ముద్రగడతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భీమవరం సమన్వయ కర్త గ్రంధి శ్రీనివాస్ ఉన్నారు. చంద్రబాబు కాపులకు అన్యాయం చేస్తున్నారని ముద్రగడ విమర్శించారు. డిసెంబర్ 6 లోగా కాపులకు న్యాయం చేయకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన న్యాయమైన కోరికనే చంద్రబాబును అడుతున్నామని ముద్రగడడ అన్నారు.
గ్రంధి శ్రీనివస్ మాట్లాడుతూ - పార్టీలకు అతీతంగా కాపులంతా ముద్రగడకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతంర యలమంచిలి మండలం బాడవ గ్రామంలో శ్రీ కృష్ణదేవరాయలు, వంగవీటి రంగా విగ్రహాలను ముద్రగడ ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications