ఇవీ సుప్రీం కోర్టు ఆదేశాలు: ముద్రగడ పద్మనాభం హౌస్ అరెస్ట్
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదివారం, సోమవారం ఆత్మీయ కలయిక ప్లాన్ చేసుకున్నారు. కానీ పోలీసులు ఆయనకు అనుమతించలేదు.
కిర్లంపూడి: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదివారం, సోమవారం ఆత్మీయ కలయిక ప్లాన్ చేసుకున్నారు. కానీ పోలీసులు ఆయనకు అనుమతించలేదు.
దీంతో శనివారమే కిర్లంపూడిలో భారీగా పోలీసులు మోహరించారు. ఆత్మీయ కలయిక పేరుతో చేపట్టిన పర్యటనకు అనుమతి లేదని పోలీసులు ముద్రగడకు తేల్చి చెప్పారు.

ఆయనను గృహనిర్బంధంలో ఉంచారు. పలువురు పోలీసు అధికారులు శనివారం ఉదయం ముద్రగడను ఆయన నివాసంలో కలిశారు. కోనసీంలో పర్యటనకు అనుమతి తీసుకోని కారణంగా ర్యాలీలు నిర్వహించేందుకు వీల్లేదని, అందువల్ల గృహ నిర్బంధం చేస్తున్నామని చెప్పారు.
సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో కూడిన పత్రాలను పోలీసులు అధికారులు ఆయనకు నోటీసుల రూపంలో ఇవ్వబోయారు. వాటిని తీసుకునేందుకు ముద్రగడ నిరాకరించారు. దీంతో ఆయన ఇంటి గేటుకు వాటిని అతికించారు.












Click it and Unblock the Notifications