ఏపీకి ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ - సీఎం జగన్ పై ప్రశంసలు..!!

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ ఏపీలో తమ పెట్టుబడుల గురించి కీలక ప్రకటన చేసారు.

విశాఖ‌ వేదికగా ఏపీకి పెట్టుబడులు పెద్ద సంఖ్యలో దక్కాయి. ఏకంగా రూ 13 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఏపీకి వచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇదే సమయంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ ఏపీలో తమ పెట్టుబడుల గురించి కీలక ప్రకటన చేసారు. ప్రధాని మోదీ - సీఎం జగన్ పైన ప్రశంసలు కురిపించారు. రెండు రోజుల సదస్సులో భాగంగా జరిగే ఒప్పందాలను ముఖ్యమంత్రి వెల్లడించారు. పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సులో పాల్గొని కీలక ప్రకటనలు చేసారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దేశంలో ముఖ్యమైన రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉందన్నారు. ఏపీలో రహదారులు..మౌళిక వసతుల కల్పను ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

ముఖేష్‌ అంబానీ కీలక ప్రకటన

ముఖేష్‌ అంబానీ కీలక ప్రకటన


ఏపీలో పెట్టుబడులకు సంబంధించి రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ ప్రకటన చేసారు. ఏపీలో త‌మ పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతుంద‌ని, 10 గిగావాట్ల సోలార్ ఎన‌ర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ముఖేశ్ అంబానీ ప్ర‌క‌టించారు. ప‌నిలో ప‌నిగా త‌మ సంస్థ‌కు చెందిన 5జీ నెట్ వ‌ర్క్ ఈ ఏడాది చివ‌రి నాటికి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంద‌ని తెలిపారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ముందు చూపు కార‌ణంగా భార‌త‌దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించింద‌ని అంబానీ అన్నారు. అదే విధంగా ఏపీలో సీఎం జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో న‌డుస్తోంద‌ని అభినందించారు. ఏపీలో జియో నెట్‌వర్క్‌ అభివృద్ధి చెందిందన్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రగతికి ఏపీ సర్కార్‌ మంచి సహకారం అందిస్తోందని వివరించారు. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పిన అంబానీ పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ నుంచే ఉన్నారని పేర్కొన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రెండో స్టేట్‌ ఏపీగా వివరించారు.

రాష్ట్రానికి పెట్టుబ‌డుల ప్ర‌వాహం

రాష్ట్రానికి పెట్టుబ‌డుల ప్ర‌వాహం

విశాఖ భాగస్వామ్య సదస్సులో భాగంగా పలువురు పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టుబడులను ప్రకటించారు. ఏపీలో తాము ఏ ఏ రంగాల్లో పెట్టుబ‌డులు పెడుతున్నామ‌నే విష‌యాన్ని వెల్ల‌డించారు. అదానీ గ్రూప్ భారీ పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ముంద‌కు వ‌చ్చింది. రెండు సిమెంట్ ఫ్యాక్ట‌రీలు, 15 వేల మెగావాట్ల ప‌వ‌ర్ ప్రాజెక్టుల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు క‌ర‌ణ్ అదానీ ప్రకటన చేసారు. కడ‌ప‌, న‌డికుడిలో సిమెంట్ ఫ్యాక్ట‌రీలు ప్రారంభించ‌నుంది. సంవ‌త్స‌రానికి 10 మిలియ‌న్ ట‌న్నులు ఇక్క‌డి నుంచి ఉత్ప‌త్తి కానున్నాయి. అదే విధంగా విశాఖ‌ప‌ట్నంలో 400 మెగావాట్ల డేటా సెంట‌ర్ ఏర్పాటు కూడా చేయ‌నున్న‌ట్లు కూడా క‌ర‌ణ్ అదానీ వెల్లడించారు. ఏపీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషకరంగా ఉందని... ఏపీలో మౌలిక సదుపాయాలు బాగున్నాయని చెప్పారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఏపీ కనెక్టివిటీ బాగుందని వివరించారు. అదే విధంగా ఇతర పారిశ్రామిక వేత్తలు తమ నిర్ణయాలను వెల్లడించారు.
పర్యాటక రంగంలో ఆసక్తి..

పర్యాటక రంగంలో ఆసక్తి..


భోగాపురం విమానాశ్రయం కోసం రూ 5వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు జీఎంఆర్ వెల్లడించారు. సదస్సులో ఒబెరాయ్‌ హోటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అర్జున్‌ బబెరాల్‌ మాట్లాడుతూ ఏపీలో పర్యాటక రంగం అంతర్జాతీయ స్థాయిలో ఉంది. ఏపీ పర్యాటక విధానం ఉత్తమంగా ఉంది. పర్యాటక రంగంలో ప్రీమియర్‌ డెస్టినేషన్‌గా ఏపీ ఉందని కితాబిచ్చారు. రెన్యూ పవర్‌ ఎండీ సుమంత్‌ సిన్హా మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం చాలా అవసరం. పరిశ్రమల అభివృద్ధికి ఏపీలో మంచి పాలసీలు ఉ‍న్నాయి. పరిశ్రమల పట్ల ఏపీలో పాజిటివ్‌ అప్రోచ్‌ ఉంది. ఇంధన రంగంలో​ ఏపీకి 3 అవార్డులు రావడం ప్రశంసనీయం. పవన, సౌర విద్యుత్ రంగంలో ఏపీలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీఎం జగన్‌ దార్శనికతతో తొందరగా అనుమతులు ఇస్తున్నారు. ఏపీలో ఉన్నతాధికారులు వేగంగా స్పందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+