సీఎం జగన్ - అంబానీ స్పెషల్ ఎట్రాక్షన్: జాతీయ స్థాయిలో చర్చ..!!
విశాఖ సదస్సులో ముఖేష్ అంబానీ ప్రత్యేకార్షణగా నిలిచారు. జగన్ తో అంబానీ సాన్నిహిత్యం చర్చకు కారణమవుతోంది.
విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమిట్ సక్సెస్ అయింది. వైసీపీ నేతలు ఖుషీగా ఉన్నారు. ఎన్నికల వేళ జోష్ పెంచింది. సీఎం జగన్ ను చూసి ఏపీలో ఎవరు పెట్టుబడులు పెడతారనే టీడీపీ నేతల విమర్శలకు సదస్సు సమాధానంగా నిలిచింది. రూ 13 లక్షల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు జరిగాయి. ఈ సదస్సుకు తరలి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు ఇంత మంది ఒకే సారి హాజరవ్వటం.. అందులో కొందరు జగన్ ను ప్రశంసించారు.
అందునా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ హాజరు ఇప్పుడు మరో ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది. ఏ సదస్సుకు హాజరు కాని అంబానీ..సీఎం జగన్ ఆహ్వానంతో విశాఖ సదస్సులో పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు ప్రకటించారు. సీఎం జగన్ ను ప్రశంసించారు.

పెట్టుబడిదారుల సదస్సుకు ముఖేష్ అంబానీ
ఏపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. పక్కా ప్రణాళికా బద్దంగా వ్యవహరించింది. సీఎం జగన్ ఈ సదస్సు నిర్వహణలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రతిపక్షాలు నాలుగేళ్ల కాలంగా చేస్తున్న విమర్శలు ఒక్క సదస్సుతో సమాధానం చెప్పారు. ఈ సదస్సులో పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. అయితే, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ హాజరు ఇప్పుడు ప్రత్యేకార్షణగా మారింది.
అంబానీ ఇప్పటి వరకు ఏ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరు కాలేదు. కీలక సదస్సులకు తన సంస్థలోని ముఖ్య వ్యక్తులను పంపేవారు. ఇప్పుడు ఏపీలో సదస్సుకు స్వయంగా హాజరు కావటం.. ఏపీలో పెట్టుబడిని స్వయంగా ప్రకటించటం ఈ సదస్సుకే హైలైట్ గా మారింది. ఇదే ఇప్పుడు పరిశ్రమ- రాజకీయ వర్గాల్లో ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.

సీఎం జగన్ - అంబానీ సన్నిహితంగా
ప్రభుత్వంలోని మంత్రులు సదస్సు ప్రారంభమయ్యే సమయం వరకు రెండు లక్షల కోట్లు లక్ష్యంగా చెబుతూ వచ్చారు. కానీ, అనూహ్యంగా రూ 13 లక్షల కోట్ల పెట్టబడులకు ఒప్పందాలు జరిగాయి. ఇప్పటి వరకు ఏ ఇన్వెస్టర్స్ సదస్సుకు హాజరు కాని అంబానీ, ఏపీ సీఎం జగన్ ఆహ్వానం మేరకు విశాఖ సదస్సుకు వచ్చారు. తనతో పాటుగా తన సంస్థలో కీలక స్థానాల్లొ ఉన్న 15 మంది సభ్యులతో ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు.
ఆయనకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి స్వాగతం పలికారు. ఇక..సదస్సు జరిగే ప్రాంగణంలోకి రాగానే సీఎం ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ కలిసే పెట్టుబడి దారుల సదస్సు వేదికపైకి వచ్చారు.
ఇక..సదస్సులో ప్రసంగించిన ముఖేష్ అంబానీ ఏపీలో దాదాపు రూ 40 వేల కోట్ల పెట్టుబడి ప్రకటించారు. ప్రధాని మోదీ..సీఎం జగన్ ను ప్రశంసించారు. ఇదే ఇప్పుడు సొంత పార్టీతో పాటుగా.. ప్రతిపక్షాలకు మింగుడు పడని అంశంగా మారింది.

ప్రముఖలను రప్పించటంలో సీఎం సక్సెస్...
అంబానీ..కరణ్ ఆదానీ..జీఎమ్మార్..పునీత్ దాల్మియా..ప్రతా రెడ్డి..సజ్జన్ భజాంక..హరిమోహన్ బంగూర్..మోహన్ రెడ్డి లాంటి వారిని ఆహ్వానించటం..వారిని రప్పించటంలో సీఎం సక్సెస్ అయ్యారు. దీంతో..పెట్టుబడి దారుల సదస్సుపైన వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఎవరికీ దక్కలేదు.
ఇంత మంది ప్రముఖులను ఒకే వేదిక మీదకు తీసుకురావటం..రూ 13 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకటన ప్రభుత్వానికి జోష్ ఇచ్చింది. ఇక, అంబానీతో సీఎం అయిన సమయం నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు కోసం స్వయంగా అంబానీ సీఎం జగన్ నివాసానికి వచ్చారు. అంబానీ కోరిన విధంగా నత్వానీకి సీఎం రాజ్యసభ సీటు ఇచ్చారు.
ఇప్పుడు సీఎం జగన్ కోరగానే..అంబానీ విశాఖ వచ్చారు. అయితే, స్వయంగా అంబానీ హాజరు కావటం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చర్చగా మారుతోంది.












Click it and Unblock the Notifications