కాదంబరి జత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్ ? కూటమి సర్కార్ హ్యాండిచ్చేసిందా ?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తవ్వితీసిన కేసుల్లో ముంబై నటి కాదంబరీ జెత్వానీ వ్యవహారం కూడా ఒకటి. గత వైసీపీ ప్రభుత్వంలో ముంబైకి చెందిన ఓ పారిశ్రామిక వేత్త కోసం ఆమెను వేధించారంటూ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు పలువురు కిందిస్థాయి సిబ్బందిపైనా ప్రభుత్వం వేటు వేసింది. దీంతో జత్వానీకి కూటమి సర్కార్ న్యాయం చేస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇవాళ మహిళా ఐక్య వేదిక నేతలతో కలిసి కాదంబరీ జెత్వానీ ప్రత్యక్షమయ్యారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆమెపై పెట్టిన తప్పుడు కేసుల్ని ఇప్పటి కూటమి సర్కార్ కూడా కొనసాగిస్తుండటంపై ఆమె ఫైర్ అయ్యారు. ఈ మేరకు మహిళా సంఘాల నేతలు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. దీంతో సీఎం చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత జోక్యం చేసుకోవాలని ఆమె ఇవాళ డిమాండ్ చేశారు.

తన మీద పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలని కాదంబరీ జత్వానీ కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మినిస్టర్ వంగలపూడి అనిత తనకు న్యాయం చేయాలన్నారు. తాను, తన కుటుంబం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు. తన కుటుంబం ఎన్నో వేధింపులకు గురైందన్నారు. తన మీద ఎన్నో అక్రమంగా తప్పుడు కేసులు పెట్టారని గుర్తుచేశారు. వాటన్నిటిని వెంటనే తీసివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆమె కోరారు.

ఇంతవరకు ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు రాలేదని, తన కేసును సిఐడి కి బదిలీ చేసిన తర్వాత ఇంతవరకు నిందితుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని ఆమె ఆరోపించారు. కుక్కల విద్యాసాగర్ బెయిలు మీద బయటకు వచ్చి యథేచ్ఛగా తిరుగుతున్నాడని, అలాగే జిందాల్ ఢిల్లీ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ పెట్టి తనను వేధిస్తున్నారని కాదంబరి వాపోయారు. విద్యాసాగర్ వెనక జిందాల్ ఉండి నడిపిస్తున్నాడన్నారు. విజయవాడ లోని మహిళా నాయకులు మొదటి నుంచి తనకు అండగా వున్నారని కాదంబరీ తెలిపారు.
మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జత్వాని కేసు గాలికి వదిలేసారని మహిళా సంఘాల నేతలు ఆరోపించారు.చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను అసభ్య పదాజాలంతో దూషించారని వెంటనే యాక్షన్ తీసుకున్నారని, మహిళలపై జరిగే అఘాయిత్యాల కేసులపై కూటమి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని, వేలాదిమంది మహిళలు వైసిపి ప్రభుత్వ పాలనలో అదృశ్యమయ్యారని ఆరోపించిన
పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.












Click it and Unblock the Notifications