కడపకు సురేశ్ బాబు స్థానంలో కొత్త మేయర్ నియామకం..!!
కడప కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కడప మేయర్ సురేశ్ బాబు పైన ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో అనర్హత వేటు వేసింది. ఈ నిర్ణయం పైన సురేశ్ బాబు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ప్రభుత్వం తాజాగా కడప ఇన్‌ఛార్జ్ మేయర్‌గా ముంతాజ్ బేగంకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు సురేశ్ బాబు తన పైన అనర్హత వేటు పైన దాఖలు చేసిన పిటీషన్ పైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది.
కడప మేయర్ గా సురేశ్ బాబును తెలిగించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా
డిప్యూటీ మేయర్‌గా ఉన్న ముంతాజ్ బేగంకు ఇన్‌ఛార్జి మేయర్ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు తన కుటుంబ సభ్యుల పేరుతో కాంట్రాక్టు పనులు చేసినందుకు గాను.. ఆయనను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలోనూ సురేశ్ బాబు పైన ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. ఆ సమంయలో సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించడంతో ఓ సారి అవకాశం ఇచ్చింది. తాజాగా సురేష్ బాబుపై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో మరోసారి ఆయనపై కూటమి ప్రభుత్వం అనర్హత వేటు వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

తాజాగా సురేష్ బాబు కుటుంబీకులు కడప నగర పాలక సంస్థలో సివిల్ కాంట్రాక్టులు చేపట్టారని ఎమ్మెల్సీ మాధవిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టి నిజమేనని తేల్చారు. దీంతో ఈ ఏడాది మార్చిలో సురేష్ బాబుకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం.. మేలో పదవి నుంచి తొలగించింది. తనపై అనర్హత పిటిషన్ వేయడాన్ని సవాల్ చేస్తూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేసి పదవి నుంచి తప్పించారని కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులో వాదనలు జరుగగా.. సురేష్ బాబు కోరిక మేరకు మరోసారి అవకాశం ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. కోర్టు సూచనల మేరకు సురేష్ బాబుకు అవకాశం ఇచ్చినప్పటికీ మరోసారి అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావటంతో ప్రభుత్వం ఆయన్ను పదవి నుంచి తప్పించింది. ఇప్పుడు కోర్టులో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications