'టీ' స్టాల్ వద్ద గొడవ: అద్దం ముక్కతో గొంతు కోసి పారిపోయాడు
విజయవాడ: ఇటీవల కాలంలో టీ స్టాల్స్ వద్ద గొడవలు మరింతగా పెరిగాయి. కృష్ణా జిల్లా నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో సోమవారం ఉదయం ఓ చిన్న వివాదం పెద్ద ఘర్షణకు దారి తీసింది. టీ కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన చిన్నపాటి గొడవ గొంతులు కోసుకునే వరకూ వెళ్లింది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు టీ తాగేందుకు టీ స్టాల్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య టీ స్టాల్ వద్ద చిన్నపాటి పాటి గొడవ చోటుచేసుకుంది. దీంతో మాటలు పెరిగాయి. కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి చేతికందిన అద్దం ముక్కతో తనతో గొడవపడ్డ అవతలి వ్యక్తి గొంతు కోశాడు.

ఈ దాడి ఘటనలో బాధిత వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్ధానికులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని గొడవకు గల కారణాలను పరిశీలిస్తున్నారు.
నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications