రాయలసీమ నేత బైరెడ్డిపై హత్య కేసు నమోదు

హత్యా స్థలంలో నిందితుల్లో ఒకడిగా భావిస్తున్న కె బాషా సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీని ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య సంఘటనలో పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన వారు కూడా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.
దీంతో ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. నిందితులు ఏ స్థాయి వారైనా వదిలి పెట్టే ప్రసక్తి లేదని, త్వరలోనే హత్యకు కారకులెవరో గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.
కర్నూలులోని నాగిరెడ్డి రెవె న్యూ కాలనీలో జరిగిన సాయిఈశ్వర్ హత్యకేసులో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆదివారం మృతదేహానికి స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదే హాన్ని బంధువులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications