సీఎం జగన్, వైఎస్ ల చిత్ర పటాలతో పాటు వైసీపీ ఎమ్మెల్యేకు పాలాభిషేకం ..రీజన్ ఇదే
సీఎం జగన్ , వై ఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర పటాలకు,అలాగే నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికు ముస్లింలు పాలాభిషేకం చేశారు. తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ మైనార్టీలకు అంతగా ఆనందం కలిగించిన అంశం ఏంటి అంటే

ఏపీలో టెన్షన్ పడిన మైనార్టీలు
ఏపీ వైసీపీలో సీఏఏ, ఎన్నార్సీ లపై మొన్నటి వరకు ఉన్న ఉత్కంఠకు తెరదించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ, ఎన్నార్సీలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఇప్పటికే వాటిని వ్యతిరేకిస్తూ పంజాబ్ , కేరళ , మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు కూడా చేశాయి. తెలంగాణాలో కూడా సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక తీర్మానం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక ఇదే సమయంలో ఏపీలో కేంద్రానికి అనుకూల నిర్ణయం తీసుకుంటారని మైనార్టీలు టెన్షన్ పడ్డారు.

ఎన్పీఆర్ విషయంలో సీఎం జగన్ నిర్ణయంతో హర్షం
పార్లమెంట్లో సిఏఏ బిల్లుకు మద్దతు తెలిపిన వైసీపీ ఏం నిర్ణయం తీసుకుంటుంది అని సందిగ్ధంలో ఉండగానే జగన్ ఎన్పీఆర్ విషయంలో అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని చెప్పటం , 2010 తరహాలో కేవలం కుటుంబ వివరాలు తీసుకోవడానికి తమకు అభ్యంతరం లేదని అలా కాకుండా ముస్లింలను అభద్రతా భావానికి గురి చేస్తే వ్యతిరేకిస్తామని చెప్పటం అటు కేంద్రాన్ని ఇబ్బందిలో పడేసింది కానీ మైనార్టీ వర్గాల్లో సంతోషం వ్యక్తం అవుతుంది.

కేంద్రానికి జగన్ మెలిక ... మైనార్టీలకు ఇబ్బంది లేకుంటేనే
ఎన్పీఆర్ విషయంలో కేంద్రం ఏపీ సూచనలు తీసుకుని అభ్యంతరకరంగా ఉన్న వాటిని పక్కన పెట్టి జాతీయ జనాభా పట్టిక తయారు చేస్తే సరి. కానీ అలా కాకుంటే ఎన్పీఆర్ ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తామని సీఎం జగన్ చెప్పటంతో ఏదైనా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో తమకు లాభం చేకూరుతుంది అని భావిస్తున్న మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవలే కోటంరెడ్డి ఎన్‌పీఆర్‌కి వ్యతిరేకంగా నెల్లూరులో భారీ సభను ఏర్పాటు చేశారు. ఎన్‌పీఆర్‌ని బాహాటంగానే వ్యతిరేకించారు.
Recommended Video


నెల్లూరులో జగన్ , వైఎస్ లతో పాటు ఎమ్మెల్యేకు పాలాభిషేకం
అందుకే నెల్లూరులో సీఎం జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ల ఫోటోలతో పాటు నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ముస్లింలు పాలాభిషేకం చేశారు . అంతేకాదు వారి ఆచారాల ప్రకారం ఆయనను సన్మానించారు. ఎన్‌పీఆర్‌కి వ్యతిరేకంగా ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ తీర్మానం చేయడంతో పాటు, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వారు ఈ విధంగా తమ కృతఙ్ఞతలు తెలియజేశారు. ఇక సీఎం జగన్‌తో పాటు మాజీ సీఎం వైఎస్సార్ చిత్రపటాలకు సైతం ఎమ్మెల్యేతో కలిసి పాలాభిషేకం చేశారు ముస్లింలు. ముఖ్యమంత్రి జగన్ అండదండలతో, మంత్రి అనిల్ కుమార్ సహకారంతో ఎన్‌పీఆర్‌పై మైనార్టీల పోరాటం ఫలించిందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి .
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications