TTD: టీటీడీ ఆధ్వర్యంలో మైసూరు దత్తపీఠంలో చతుర్వేద హవనం, శ్రీవారు అవతరించిన శ్రావణ మాసంలో !
తిరుమల/ తిరుపతి/ మైసూరు: శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అభ్యర్థన మేరకు మైసూరు దత్త పీఠం లో సెప్టెంబరు 1వ తేదీ నుంచి 5 వ తేదీ వరకు ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస పంచాహ్నిక చతుర్వేద హవనం కార్యక్రమం నిర్వహించనున్నారు.
లోకక్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్య వృద్ధి, అతివృష్టి, అనావృష్టి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి అవతరించిన శ్రావణ మాసంలో బహుళ దశమి నుంచి ఐదు రోజుల పాటు ఈ ఈ కార్యక్రమం టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

మైసూరు దత్తపీఠం
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అభ్యర్థన మేరకు మైసూరు దత్త పీఠం లో సెప్టెంబరు 1వ తేదీ నుంచి 5 వ తేదీ వరకు ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస పంచాహ్నిక చతుర్వేద హవనం కార్యక్రమం నిర్వహించనున్నారు.హోమ గుండాలు ఏర్పాటు చేసి నాలుగు వేదాల్లోని అన్ని మంత్రాలను పఠించి యజ్ఞేశ్వరునికి సమర్పణ చేస్తారు.ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు వేద విద్వాంసుల ప్రసంగాలు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల దాకా భజనలు, నృత్య రూపకం, సంగీత కచేరీలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

బ్రహ్మశ్రీ ఉపన్యాసం
సెప్టెంబర్ 1వ తేదీ వేదోక్త యజ్ఞం - ప్రయోజనాలు అనే అంశంపై విజయవాడకు చెందిన బ్రహ్మశ్రీ వి. లక్ష్మీనారాయణ ఘనాపాటి ఉపన్యసిస్తారు. 2వ తేదీ చతుర్వేద హవనం - ప్రాశస్త్యం అనే అంశం మీద జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య మురళీధరశర్మ ఉపన్యాసం ఉంటుంది.

విభీష శర్మ ప్రసంగం
3వ తేదీ వేద భారతి - యజ్ఞ దేవతలు అనే అంశం మీద కర్నాటక రాష్ట్ర సంస్కృత విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య కె ఈ దేవనాథన్ ఉపన్యసిస్తారు. 4వ తేదీ ప్రస్తుత కాలంలో వేద హవనాలు - వాటి ఆవశ్యకత అనే అంశం మీద టీటీడీ ఎస్వీ వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి శ్రీ ఆకెళ్ళ విభీషణ శర్మ ప్రసంగిస్తారు.

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆహ్వానం
5వ తేదీ పూర్ణాహుతి కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కర్ణాటకతో పాటు తమిళనాడు నుంచి పరిమితి సంఖ్యలో దత్తపీఠానికి భక్తులు హాజరుకానున్నారని సమాచారం. కర్ణాటకలో శ్రీ గణపతి సచ్చిదానంద దత్త పీఠంకు ఎంతో ప్రత్యేకతలు ఉన్నాయి. అక్కడికి వేలాది మంది భక్తులు వెళ్లి వస్తుంటారు.
-
Trains: నరసాపురం, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications