గన్ ఫైరింగ్‌లో ఎమ్మెల్యే డ్రైవర్ మృతి: వీడని మిస్టరీ (పిక్చర్స్)
హైదరాబాద్: నర్సాపూర్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు మదన్ రెడ్డి డ్రైవర్ సయ్యద్ అక్బర్ మృతి మిస్టరీగానే మిగిలింది. తమ కొడకును చంపేశారని అక్బర్ తల్లిదండ్రులు అనిరుద్దీన్, దుర్జానియా ఆరోపించారు. అక్బర్ తుపాకీ మిస్ ఫైర్ అవడం వల్ల చనిపోయాడని, తుపాకీతో అతనే కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలో అతని తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. తమ కొడుకు మృతిపై అనుమానాలున్నాయన్నారు. తమ గ్రామం నుంచి ఇద్దరే హైదరాబాద్ వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లాలని పోలీసులు చెప్పారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.. దీనిపై తమకు అనుమానాలున్నాయన్నారు.
సంఘటన జరిగిన వెంటనే తన గ్రామం నుంచి హుటాహుటిన వచ్చిన సయ్యద్ అక్బర్ ఆంటీ కూడా అతని మృతిపై అనుమానాలు వ్యక్తం చేసింది.

డ్రైవర్ ఇతనే..
ప్రమాదవశాత్తు గన్ పేలడంతో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డ్రైవర్ సయ్యద్ అక్బర్ మరణించాడని అంటున్నారు.

అది పిఎస్‌వో పిస్టల్
ఎమ్మెల్యే మదన్ రెడ్డి పిఎస్ఓ రవీంద్రకు చెందిన 9ఎంఎం పిస్టల్‌ను చూస్తానంటూ అక్బర్ తీసుకున్నాడని, ఈ సమయంలో మిస్ ఫైర్ అయి అక్బర్ చనిపోయాడని అంటున్నారు.

విచారించారు....
పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అసలు సంఘటన ఎలా జరిగిందనే వివరాలను అతని నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు.

నిర్లక్ష్యానికి మూల్యమేనా...
నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణపై పోలీసులు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపిసి 304ఎ కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications