కన్వెన్షన్: 3 ఎకరాలు కబ్జా, నాగార్జున మాటేమిటి?
హైదరాబాద్: సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై దృష్టి పెట్టిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) అధికారులు శనివారం సర్వే నిర్వహించారు. దీనికి అనుకుని ఉన్న తమ్మిడికుంట చెరువు ఏ మేరకు కబ్జాకు గురైందనే విషయాన్ని తేల్చడానికి ఈ సర్వే నిర్వహించారు. 3 ఎకరాల 12 గుంటల భూమి కబ్జాకు గురైందని సర్వేలో తేలినట్లు అధికారులు చెప్పారు.
తమ్మడికుంట చెరువు మొత్తం 29 ఎకరాల్లో ఉంటుంది. కబ్జాకు గురైన భూమిలో రెండు ఎకరాలు బఫర్ జోన్‌కు చెందింది కాదా, ఎకరా 12 గుంటలు ఎకరాలు పూర్తిస్థాయి చెరువు స్థాయి (ఎఫ్‌టిఎల్)కు చెందిందని గుర్తించారు. అక్రమ నిర్మాణాలను కూల్చే పనిలో భాగంగా జిహెచ్ఎంసి అధికారులు తమ్మడికుంట చెరువు సర్వే చేశారు.

ఆ భూమిని తాను 1992లో గురుకుల్ ఘట్కేసర్ ట్రస్టు నుంచి కొన్నానని, తన పేరు మీదికి ఆస్తి మారిందని నాగార్జున అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. వెంటనే తాను భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నానని, అయితే భూమి వివాదంలో ఉందనే కారణంతో అందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు.
తాను 2008లో క్రమబద్దీకరణకు జిహెచ్ఎంసికి దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అది ఇంకా పెండింగులో ఉందని చెప్పారు. ఇప్పటికే జిహెచ్ఎంసి అధికారులు అయ్యప్ప సొసైటీలో నిర్మాణం పూర్తయిన 11 అక్రమ భవనాలను సీల్ చేశారు.












Click it and Unblock the Notifications