నాడు నేడు పనుల్లో అంతా మోసం ; వీడియో వైరల్ .. విద్యా శాఖామంత్రి ఇలాకాలో షాకింగ్ ఘటన !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల పునరుద్ధరణ కొరకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నడుంబిగించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన పాఠశాలల రూపురేఖలు మార్చిన నాడు నేడు పనులపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి . రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్న నాడు-నేడు పనుల నిర్వహణలో పారదర్శకత లేదని, నాడు నేడు పనులు అంతా మోసమని, ఈ పనులలో కాంట్రాక్టర్లదే హవా అని సెల్ఫీ వీడియో చేసి మరి సంచలన ఆరోపణలు చేశారు.

నాడు నేడు పనులపై సంచలన ఆరోపణల వీడియో .. విద్యామంత్రి ఇలాకాలో ఘటన
ఎర్రగొండపాలెం నియోజకవర్గం గుర్రపు శాల ఎంపీపీ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బద్దెగం సుబ్బారెడ్డి చేసిన వీడియో నెట్టింట రచ్చ చేస్తోంది. అధికార వైసీపీ కి చెందిన ఓ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ సుబ్బారెడ్డి నాడు నేడు పనులకు బిల్లులు చెల్లింపు సక్రమంగా జరగడం లేదని నాడు నేడు పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయి అంటూ సెల్ఫీ వీడియో తీస్తూ ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సొంత ఇలాకాలోనే విద్యా శాఖకు సంబంధించిన నాడు నేడు పనులలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

తనకు రావాల్సిన బిల్లులు ఇవ్వకుంటే ఆ ఎన్నికలు బహిష్కరిస్తామని వెల్లడి
ఈ సెల్ఫీ వీడియోలో బద్దెగం సుబ్బారెడ్డి నాడు నేడు పనులకు సంబంధించి తనకు రావలసిన బిల్లులు రాని విషయాన్ని ప్రస్తావించారు. పాఠశాల హెడ్మాస్టర్ కు చెప్పినా స్పందించలేదని, అధికారులు, తమ ఎమ్మెల్యే అయిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కి చెప్పినా ఫలితం లేదని ఆయన వాపోయారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన సుబ్బారెడ్డి జగన్ అనుకున్నట్లు నాడు-నేడు పనుల్లో పారదర్శకత లేదని తెలిపారు. నాడు నేడు పనులన్నీ కాంట్రాక్టర్లు చేస్తున్నారని, అందులో తాను చేసిన కొద్దిపాటి పనుల బిల్లులు ఆగిపోయాయని పేర్కొన్న ఆయన, తన బిల్లులు చెల్లించకుంటే ఈనెల 22వ తేదీన జరగనున్న తల్లిదండ్రుల కమిటీ ఎన్నికను బహిష్కరిస్తామని పేర్కొన్నారు.

తన వీడియో సందేశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి
ఈ సందేశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని కూడా ఆయన వీడియో ద్వారా వేడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తాజాగా నాడు-నేడు పనుల పారదర్శకత పై సుబ్బా రెడ్డి చేసిన ఆరోపణలు వైసీపీ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. సుబ్బారెడ్డి ఆరోపణలను ఎవరు పట్టించుకోవద్దని మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. ఏపీ సర్కార్ నాడు-నేడు పనులను ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిపించామని చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది .
Recommended Video

టీడీపీకి ఆయుధంగా నాడు నేడు పనులపై సెల్ఫీ వీడియో .. విద్యామంత్రి స్పందిస్తారా ?
టీడీపీ పాలనలో అప్పటి పాఠశాలల రూపురేఖలకు ఇప్పటి పాఠశాలల రూపురేఖలకు వ్యత్యాసాన్ని చూడాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే, ఇప్పుడు ఈ పనుల్లో కూడా అవినీతి జరిగిందని, అక్రమాలు చోటుచేసుకున్నాయని వార్తలు రావడం జగన్ సర్కార్ కు మింగుడు పడడం లేదు. ఈ వీడియో టీడీపీ నేతలు వాడుకునే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతుంది. ఈ వీడియోతో నాడు నేడు పనులపై టీడీపీ విమర్శల బాణాలు ఎక్కు పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి వైరల్ అవుతున్న ఈ వీడియో పై వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏం సమాధానం చెప్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications