జగన్ పై నాగబాబు ఫైర్ .. తెలంగాణా విద్యార్థుల ఆత్మహత్యలపై ఒక్క వెధవ మాట్లాడలేదని ఆగ్రహం
Recommended Video
జనసేన పార్టీ నర్సాపురం లోక్ సభ అభ్యర్థి నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా ఉక్కునగర్ లో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సదస్సులో పాల్గొన్న నాగబాబు జనసేన పార్టీ పై అవాకులు చెవాకులు పేలుతున్న రాజకీయ వర్గాలపై విరుచుకుపడ్డారు. తన సోదరుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎవరినైనా తిట్టాడా మీ జోలికి వచ్చాడా అంటూ మండిపడ్డాడు మెగా బ్రదర్ నాగబాబు .

ఒరేయ్ రాస్కెల్స్ ఇంటర్ విద్యార్థులు మరణిస్తే ఒక్క వెధవ మాట్లాడలేదు ఎందుకు ... నాగబాబు ఫైర్
ఒరేయ్ రాస్కెల్స్ తెలంగాణ రాష్ట్రంలో 23 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణిస్తే ఒక్క వెధవ ఎందుకు మాట్లాడలేదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్న నాగబాబు తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో జనసేన పోరాటం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది జనసైనికులు అంటూ నాగబాబు స్పష్టం చేశారు. అది జనసేన స్పిరిట్ అంటూ ఆవేశంతో మాట్లాడారు నాగబాబు.

విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రశ్నించేందుకు ధైర్యం లేదా .. పవన్ కళ్యాణ్ ని మాత్రం తిడతారా
వైసీపీ నేతలపై మాటల దాడి చేసిన నాగబాబు ప్రజల పక్షాన పోరాటం చేసే దమ్ము ఒక్క జనసేనకే ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఉదాసీనత, ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నాగబాబు ఆరోపించారు. దాన్ని ప్రశ్నించేందుకు ఈ షోకాల్డ్ పెయిడ్ ఆర్టిస్ట్ నాయకులకు ధైర్యం లేదు కానీ పవన్ కళ్యాణ్ ని మాత్రం తిడతారా అంటూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు నాగబాబు.

విద్యార్థుల మరణాలపై స్పందించాలని జగన్ కు నాగబాబు సవాల్
తెలంగాణలో విద్యార్థులు చనిపోతే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కానీ విజయసాయిరెడ్డి కానీ స్పందించలేదన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలపై మాట్లాడటానికి నోరు రాలేదా అని ప్రశ్నించారు. అది పక్కరాష్ట్రం సమస్యలా చూశారని కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి జగన్ చాలా గొప్పగా మాట్లాడతాడని విమర్శించారు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడటం అంత అవసరమా అంటూ నిలదీశారు.తనకు గానీ, పవన్ కళ్యాణ్ కు గానీ కేసీఆర్ అంటే భయం లేదన్నారు.ఐడోంట్ కేర్ కేసీఆర్ అంటూ నాగబాబు తేల్చి చెప్పారు. దమ్ముంటే ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణాలపై స్పందించాలని నాగబాబు జగన్ కు సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications