గొంతుకోసి, బాయిలర్‌లో వేసి చిన్నారి నాగవైష్ణవి హత్య కేసు: కాసేపట్లో కోర్టు తీర్పు
విజయవాడ: ఎనిమిదేళ్ల క్రితం విజయవాడలో సంచలనం రేపిన చిన్నారి నాగవైష్ణవి కేసులో న్యాయస్థానం నేడు తుది తీర్పు వెలువరించనుంది. 2010 జనవరి 30వ తేదీన కారులో పాఠశాలకు వెళ్తున్న చిన్నారి నాగవైష్ణవిని కిడ్నాప్ చేసి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత బాయిలర్‌లో వేసి దహనం చేశారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది.
నాగవైష్ణవిని చంపకుండా అడ్డువచ్చిన డ్రైవర్ లక్ష్మణ రావును కూడా చంపేశారు. నాగవైష్ణవి మృతి తెలిసి తండ్రి పలగాని ప్రభాకర్ మనోవేధనతో మృతి చెందారు. ఈ హత్య, మృతి పట్ల కంటతడి పెట్టని వారు లేరు.

ఈ కేసులో అరెస్టైన ఏ1 మొర్ల శ్రీనివాసరావు, ఏ2 వెంపరాల జగదీష్, ఏ3 పంది వెంకట్రావ్ గత ఏడేళ్లుగా జైల్లో ఉన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు కాకుండానే కేసు విచారణ పూర్తి కాగా నేడు తుది తీర్పు వెలువడనుంది.












Click it and Unblock the Notifications