టీడీపీపై జనసేన కార్యకర్త ఫిర్యాదు..ఏయ్ మైక్ కట్ చేయ్.. నాగబాబు సంచలనం
జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు, కార్యకర్తల అసంతృప్తి తెరపైకి వచ్చింది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన ఒక సమావేశంలో ఒక కార్యకర్త తమ ఆవేదనను జనసేన నాయకుడు నాగబాబు ముందు వెళ్లబోసుకున్నారు. కూటమిలో భాగంగా తమ పార్టీ తరఫున ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆధిపత్యమే ఎక్కువగా ఉందని, తమకు సరైన గుర్తింపు లభించడం లేదని గోపీనాథ్ అనే కార్యకర్త నాగబాబు దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
విశాఖ సౌత్ లో జనసేన ఎమ్మెల్యే ఉన్నా టీడీపీ ఆధిపత్యం ఎక్కువ అయ్యింది. దీనిని మీరు #PawanKalyan గారి దృష్టికి తీసుకెళ్లాలి. - జనసేన నేత గోపికృష్ణ
— Tupaki (@tupaki_official) July 30, 2025
గోపికృష్ణ చెబుతుండగా అసహనానికి గురైన #NagaBabu... మైక్ కట్ చేయాలని ఆదేశం#Janasena #TDP #AndhraPradesh #Tupaki pic.twitter.com/vAnkqvskd6
అయితే, కార్యకర్త తన సమస్యను వివరిస్తుండగా నాగబాబు అసహనానికి గురయ్యారు. వెంటనే మైక్ కట్ చేయాలని ఆదేశించడంతో, గోపీనాథ్‌తో పాటు అక్కడ ఉన్న మొత్తం జనసేన శ్రేణులు బిత్తరపోయాయి. కార్యకర్తలు ఏ పార్టీకైనా ముఖ్యమని, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం పార్టీ మనుగడకు అత్యవసరం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేనకు ప్రాణం పెట్టే అభిమానులు, కార్యకర్తలు ఉండగా, వారి బాధను వినకుండా మైక్ కట్ చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక మహిళా కార్పొరేటర్ విషయంలోనూ ఇదే విధంగా సమస్యలు చెబుతుండగా మైక్ కట్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. సమీక్షలు, సమావేశాల పేరుతో పార్టీలోని సమస్యలను వెల్లడించకూడదంటే ఎలా అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం సర్వస్వం పెట్టిన వారికి తగిన గుర్తింపు, వారి సమస్యలకు పరిష్కారం చూపకపోతే అది పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదన్న చర్చ జరుగుతోంది. నాగబాబు చర్య జనసేన అంతర్గత రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.












Click it and Unblock the Notifications