వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరును రోజా తిట్టడంలో వింతేంలేదు, పవన్‌కు అన్నయ్య సపోర్ట్ చేయాలి: నాగబాబు

నోట్ల రద్దు అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని పొగిడితే తన అన్నయ్య చిరంజీవి మెచ్చుకున్నారని మెగా సోదరులు నాగబాబు అన్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నోట్ల రద్దు అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని పొగిడితే తన అన్నయ్య చిరంజీవి మెచ్చుకున్నారని మెగా సోదరులు నాగబాబు అన్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు మాట్లాడారు.

రోజా తన సోదరుడు చిరంజీవిని విమర్శించడం పైన, అలాగే, తన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఉండటం పైన నాగబాబు స్పందించారు.

naga babu

మోడీ వీడియోపై చిరంజీవి మెచ్చుకోలు

నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోడీని పొగుడుతూ తాను యూట్యూబ్‌లో పెట్టిన వీడియోపై చిరంజీవి పొగిడారన్నారు. అన్న కాంగ్రెస్‌ సభ్యుడిగా ఉన్నా తాను బీజేపీని ప్రశంసించడాన్ని చిరంజీవి సీరియస్‌గా తీసుకోలేదన్నారు. అంతేకాదు బాగా మాట్లాడానని కితాబిచ్చారని చెప్పారు. మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశానికి మేలు చేసేదేనని ఇప్పటికీ చెబుతానని వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ కోసం అన్నయ్య పని చేయాలి

2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం అన్నయ్య చిరంజీవి ప్రచారం చేయాలని తాను కోరుకుంటున్నానని నాగబాబు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ్ముడి కోసం పని చేయాలని ఉందని తెలిపారు. తాను మాత్రం తమ్ముడికి సాధారణ కార్యకర్తలా పని చేస్తానన్నారు. అతనితో ఎవరినీ పోల్చలేమని, అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారన్నారు. పవన్ వస్తే వంద శాతం రాష్ట్రం బాగుపడుతుందన్నారు.

పెద్ద స్టార్

పవన్ కళ్యాణే పెద్ద స్టార్ అని, అంతకుమించి స్టార్ ఎవరుంటారని చెప్పారు. గతంలో ఫ్యాన్స్ పైన ఆ తరహా వ్యాఖ్యలు తాను చేయకుండా ఉండాల్సిందని చెప్పారు.

చిరంజీవిని విమర్శించడంలో వింతేం లేదు

తన సోదరులు చిరంజీవి, నాగబాబుల పైన విమర్శలు చేసే రోజాతో కలిసి జబర్దస్ద్‌లో నవ్వడంపై నాగబాబు మాట్లాడారు. తాము చేస్తోంది కామెడీ ప్రోగ్రాం అని, అక్కడ రోజా జడ్జిగానే వ్యవహరిస్తారన్నారు.

బయట మాత్రం ఆమె పార్టీ విధానాలకు అనుగుణంగా అన్ని పార్టీలపైనా విమర్శలు చేస్తుంటారని, అందులో వింతేమీ లేదన్నారు. రోజా ఒక్క చిరంజీవినే విమర్శించరని, టీడీపీ నేతలను కూడా విమర్శిస్తుంటారని తెలిపారు. కార్యక్రమం వేరు, పార్టీ వేరని తెలిపారు.

English summary
Nagababu on Sunday said that he want to work for Pawan Kalyan's Jana Sena in 2019 general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X