నాగబాబు మరో సంచలనం... కరెన్సీ నోట్ల మీద వారి చిత్రాలను చూడాలని ఉంది

జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గాడ్సే గురించి వివాదాస్పద పోస్టులు రేపిన దుమారం మరచిపోక ముందే మరోమారు సంచలన ట్వీట్ చేశారు నాగబాబు . విమర్శలు ఎదురవుతున్నా సరే నాగబాబు తాజాగా మరో సారి తన పోస్టులకు పదును పెట్టారు. ఇండియన్ కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీతోపాటు నాడు స్వాతంత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాటం చేసిన వారి ఫోటోలు ఉండాలని , ఆ మహానుభావుల చిత్రాలను చూడాలని ఉందని ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావుల ఫోటోలు కరెన్సీ మీద చూడాలన్న ఆశ

స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావుల ఫోటోలు కరెన్సీ మీద చూడాలన్న ఆశ

"ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ" అంటూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు . దేశం కోసం ఆశువులు బాసిన ఎందరో వీరులను గుర్తు చేసుకునే వీలు తద్వారా కలుగుతుంది అనే భావన వ్యక్తం చేశారు నాగబాబు .

గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా అదే చెప్పేవారన్న నాగబాబు

గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా అదే చెప్పేవారన్న నాగబాబు

ఇక మరో ట్వీట్ లో గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు అంటూ పేర్కొన్నారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. కాబట్టి భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది అని తెలుగులో ఆయన సంచలన ట్వీట్ చేసారు. ఇక్కడ గాంధీ ప్రస్తావన కూడా తెచ్చి ఆయనే తన కోరికను సమర్ధించే వారని చాలా తెలివిగా పోస్ట్ పెట్టారు .

Recommended Video

    Nagababu Satires AP Tourism Minister Avanthi Srinivasarao Over LG Polymers Issue
    నాగబాబు పోస్ట్ పై మిశ్రమ స్పందన .. గాడ్సేని మరచిపోయారా అని సెటైర్

    నాగబాబు పోస్ట్ పై మిశ్రమ స్పందన .. గాడ్సేని మరచిపోయారా అని సెటైర్

    అయితే నాగబాబు చేసిన పోస్ట్‌పై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు మన ఇండియన్ కరెన్సీ మీద మహాత్మా గాంధీ చిత్రమే ముద్రించబడుతూ ఉంది. ఇక ఇటీవల గాడ్సే విషయంలో వివాదాస్పదమైన ట్వీట్ చేసిన అనంతరం పెట్టిన ఈ పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు గాడ్సేని మరచిపోయారా మీ లిస్టు లో అని చురకలు అంటిస్తే , చాలా మంది కరెక్ట్ గా చెప్పారు. అందరు దేశభక్తుల చిత్రాలు కరెన్సీ నోట్ల మీద ఉండాల్సిన అవసరం ఉంది అని నాగబాబు పోస్ట్ కు మద్దతు ఇస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+