ఇల్లు కట్టకనే పాలు పొంగిస్తున్నారు: కెసిఆర్‌పై నాగం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తమతోనే సాధ్యమైందని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు ఉద్యమం ఎప్పుడు చేశారో చెప్పాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
కెసిఆర్ ప్రజలకు ఇస్తున్న హామీలు.. ఇల్లు కట్టకుండానే పాలు పొంగిస్తున్న చందంగా ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తామని చెప్పుకుంటున్న కెసిఆర్.. తెలంగాణ ద్రోహులను తన పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారో చెప్పాలని నాగం జనార్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రజలకు, ఉద్యోగులకు భారతీయ జనతా పార్టీతోనే న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టు అని ఇప్పటి వరకు మీకు తెలియదా అని నాగం జనార్ధన్ రెడ్డి.. కెసిఆర్‌ను ప్రశ్నించారు.
కెసిఆర్ మంత్రివర్గంలో ఉన్న సమయంలోనే ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగినా అప్పుడు నోరు మెదపలేదని నాగం జనార్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications