వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: నాగార్జున సాగర్ ఉపఎన్నిక -మిగిలింది ఒక్కరోజే -టీఆర్ఎస్, బీజేపీ మల్లగుల్లాలు -జనసేనకు అవకాశం?

|
Google Oneindia TeluguNews

నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు సంబందించి ఎన్నికల కమిషన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. నామినేషన్లకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించడంతో శుక్రవారాన్ని మినహాయిస్తే కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలింది. ఇప్పటికే కాంగ్రెస్ తరఫున జనారెడ్డి పేరు ఖరారుకాగా ఆయన 30నే నామినేషన్ వేయనున్నారు. అయితే, టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం ఇంకా అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నాయి. తిరుపతిలో త్యాగానికి గానూ నాగార్జున సాగర్ లో జనసేనకు అవకాశం కల్పిస్తారనీ ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే..

 తిరుపతి పోరు: రత్నప్రభ అనూహ్య స్పందన -పవన్ కల్యాణ్ షాకింగ్ తీరు -ఉమ్మడి కమిటీ ఉంటుందా? తిరుపతి పోరు: రత్నప్రభ అనూహ్య స్పందన -పవన్ కల్యాణ్ షాకింగ్ తీరు -ఉమ్మడి కమిటీ ఉంటుందా?

3రోజులు ఈసీ సెలవులు

3రోజులు ఈసీ సెలవులు

టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కరోనా బారినపడి చనిపోవడంతో నాగార్జున సాగర్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలతోపాటే ఖాళీగా ఉన్న లోక్ సభ, ఇతర రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఎన్నికలు జరుపుతున్నది. షెడ్యూల్ ప్రకారం ఏపీలోని తిరుపతి లోక్ సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 17న పోలింగ జరుగనుంది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 30 తుది గడువుకాగా, దానికి మూడు రోజుల ముందు సెలవులుంటాయని ఈసీ పేర్కొంది. ఈనెల 27, 28, 29 వరుస సెలవులు ఉంటాయని, ఆయా తేదీల్లో నామినేషన్లను స్వీకరించబోమని సాగర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్వో రోహిత్ సింగ్ వెల్లడించారు. దీంతో

viral video: పాక్‌తో మోదీ స్నేహం వేళ -ఢిల్లీలో కిరాతక ఘటన -ఆ దేశాన్ని, ఓవైసీని తిట్టాలంటూ దాడిviral video: పాక్‌తో మోదీ స్నేహం వేళ -ఢిల్లీలో కిరాతక ఘటన -ఆ దేశాన్ని, ఓవైసీని తిట్టాలంటూ దాడి

మూడు పార్టీలూ చివరి రోజే

మూడు పార్టీలూ చివరి రోజే

సాగర్ లో నామినేషన్లకు వరుస సెలవులు ఉంటాయన్న విషయాన్ని ఈసీ గురువారం ప్రకటించింది. దీంతో శుక్రవారం(మార్చి 27) మినహా ఒక్కరోజే(చివరిరోజైన మార్చి 30) మాత్రమే అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి తాను 30నే నామినేషన్ వేస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక అధికార టీఆర్ఎస్, బీజేపీలు సైతం చివరి రోజే అభ్యర్థిని ఖరారు చేసి, అప్పటికప్పుడే నామినేషన్ వేయించేలా ప్రణాళికలు సిద్ధం చేశాయి. రెండు పార్టీల్లోనూ అభ్యర్థిత్వం కోసం విపరీతమైన పోటీ ఏర్పడటంతో అధిష్టానాలు సమాలోచనలు జరుపుతున్నాయి.

ప్రాబబుల్స్ వీరే..

ప్రాబబుల్స్ వీరే..

టీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌తో పాటు అదే సామాజికవర్గానికి చెందిన రంజిత్‌ యాదవ్, గురువయ్య యాదవ్, దూది మెట్ల బాలరాజు యాదవ్‌ లు టికెట్లు ఆశిస్తుండగా, వీరిలో ఒకరికి అవకాశం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్.. సాగర్ సెగ్మెంట్లో అడుగడుగునా ఇంచార్జీలను నియమించింది. గడిచిన 15 రోజులుగా కీలక నేతలంతా అక్కడే మకావం వేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి రేసులో కడారి అంజయ్య, రవి నాయక్, నివేదితారెడ్డి తోపాటు టీఆర్‌ఎస్ నేత ఎంసీ కోటిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ-జనసేన పొత్తుకు సంబంధించి ఆసక్తికర వాదనలు ప్రచారంలోకి వచ్చాయి..

బీజేపీ హైకమాండ్ ట్విస్ట్

బీజేపీ హైకమాండ్ ట్విస్ట్

సాగర్ లో పార్టీ అభ్యర్థి ఎంపికపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ గురువారం కీలక నేతలతో చర్చలు జరిపారు. ఆ భేటీ తర్వాత ఢిల్లీలోని హైకమాండ్ ఉప ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తిరుపతి లోక్ సభలో రత్నప్రభకు, బెల్గాం లోక్ సభ స్థానంలో దివంతగత కేంద్ర మంత్రి సురేశ్ అంగడి భార్య మంగళ పేరును ఖరారు చేసది. అదే సమయంలో కర్ణాటక, జార్ఖండ్, మిజోరం, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఉప ఎన్నికలకూ పేర్లను ప్రకటించారు. కానీ సాగర్ సీటుపై ట్విస్ట్ ఇస్తూ అభ్యర్థిని ప్రకటించలేదు. అంతేకాదు..

సాగర్ సీటు జనసేనకు ఇస్తారా?

సాగర్ సీటు జనసేనకు ఇస్తారా?

సాధారణంగా ప్రతి ఉప ఎన్నికనూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సాధ్యమైనంత గట్టిగా పోరాడే బీజేపీ, నాగార్జున సాగర్ విషయంలో మాత్రం దూకుడు తగ్గించడం, కనీసం ప్రచార కమిటీని కూడా ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది. విచిత్రంగా సాగర్ లో జనసేన పార్టీ.. బీజేపీతో సంబంధం లేకుండా ప్రచారా కమిటీని ప్రకటిస్తే, తిరుపతి లోక్ సభ స్థానంలో బీజేపీ కూడా జనసేనతో సంబంధంలేని ప్రచార కమిటీని ప్రకటించింది. తిరుపతిలో జనసేన త్యాగానికి ప్రతిఫలంగా నాగార్జున సాగర్ లో పోటీకి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సాగర్ లో ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థిని పవర్ బరిలోకి దింపుతారనే వాదన వినిపిస్తోంది. తెలంగాణలో ఊపుమీదున్న బీజేపీ సాగర్ టికెట్ ను జనసేనకు ఇవ్వడం ఆత్మహత్యాసదృశం అవుతుంది. ఇప్పటికే పవన్, బండి సంజయ్ మధ్య మాటల యుద్దం కూడా నడిచింది. ఈ నేపథ్యంలో బీజేపీ అంత రిస్క్ చేస్తుందా, తెలంగాణలో ఎలాగూ తెగదెంపులు ప్రకటించారు కాబట్టి జనసేన నేరుగా పోటీకి దిగుతుందా? అనేది వేచిచూడాలి.

English summary
TRS and BJP are squabbling over the selection of candidates for Nagarjuna Sagar Assembly constituency by-election. 3 holidays declared for Sagar by-poll nomination filing, March 30 (Tuesday) is last day. The BJP, which has announced its candidates for tirupati and rest of the by-elections in the country, is still vying for the Nagarjuna Sagar seat. There is also a campaign to give Sagar seat to Janasena as part of the alliance. The BJP is likely to respond only after announcing the TRS candidate. April 30 is the last date for nominations in Sagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X