రోజాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిన గాలి, నగిరిలో ఆ ఆటలు ఇకసాగవు, తమిళనాడుకు?
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్ కే రోజాకు నగిరి నియోజక వర్గం టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో చేసిన అవకతవలు ఇప్పుడు మళ్లీ చెయ్యాలని ప్రయత్నిస్తే చూస్తూ ఉరుకునేది లేదని, అక్రమంగా తమిళనాడుకు మైనింగ్ మట్టిని లారీలలో నింపి పంపిస్తే సీజ్ చేస్తామని వైసీపీ నాయకులకు నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ హెచ్చరించారు.
నగిరి అసెంబ్లీ నియోజక వర్గంలోని విజయపుర మండలంలో అధికారులతో టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చర్చలు జరిపారు. గత ప్రభుత్వంలో ఓ ప్రాంతంలో క్వారీ నిర్వహించడానికి ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకుని తరువాత మరో ప్రాంతంలో క్వారీ నిర్వహిస్తున్నారని గాలి భానుప్రకాష్ ఆరోపించారు. అలాంటి అక్రమ క్వారీలు వెంటనే మూసివేయాలని, లేదంటే అధికారులు వచ్చి సీజ్ చేస్తారని వైసీపీ నాయకులను హెచ్చరించారు.

గత వైసీపీ ప్రభుత్వంలో విజయపుర మండలంతో పాటు నగిరిలోని అనేక ప్రాంతాల్లో అక్రమంగా కొండలు తవ్వేసి ఆ గ్రావెల్ మట్టిని సేకరించి ఆ మట్టిని అక్రమంగా తమిళనాడుకు తరలించారని నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆరోపించారు. నగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో అక్రమంగా కొండలు తవ్వేసి ఆ గ్రావెల్ ను సేకరించి తమిళనాడుకు తరలిస్తున్నారని, అలాంటి అక్రమ క్వారీల గురించి నివేదిక తయారు చేసి ఇవ్వాలని అధికారులకు ఇప్పటికే సూచించామని టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అండ చూసుకుని అక్రమంగా కొండలు తవ్వేసి ఆ మట్టిని లారీలల్లో తమిళనాడుకు తరలించారని, ఇక ముందు తమిళనాడుకు అక్రమంగా మట్టిని తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్ హెచ్చరించారు. ఇక ముందు ఇలాంటి ఆటలు సాగవని, అక్రమాలను అధికారులు అడ్డుకోకుంటా మొదట వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం మారిపోయినా ఇంకా చాలా మంది అధికారులు వైసీపీ భజన చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications