వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘నీరు-ప్రగతి’కి రండి: స్ఫూర్తినివ్వాలని రాష్ట్రపతిని కోరిన చంద్రబాబు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన ‘నీరు-ప్రగతి' కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరారు. రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ఈ ప్రయత్నానికి మద్దతు పలికి రైతులకు స్ఫూర్తినివ్వాలని విజ్ఞప్తి చేశారు.

డిసెంబర్ 29, 30 తేదీల్లో ఏదో ఒక రోజు వీలుచూసుకొని నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పథకాలను ఆయనకు వివరించారు.

తమ ప్రభుత్వం సాగునీటి రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. రెండు ప్రధాన జీవనదులను అనుసంధానించినట్లు తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఉద్దేశాన్ని, తద్వారా రాయలసీమకు కలిగే ప్రయోజనాన్ని వివరించారు.

దేశంలో అతితక్కువ వర్షపాతం కురిసే జిల్లాల్లో రెండోదైన అనంతపురంలో ఇలాంటి లక్ష చెరువులను తవ్వించనున్నట్లు తెలిపారు. అక్కడ భూగర్భజలాలు 3 నుంచి 8 మీటర్లలోపు అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తున్నామన్నారు.

విస్తృతంగా మొక్కలు పెంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతల్ని 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. హెలీక్యాప్టర్ల నుంచి కొండలపైనా పెద్దఎత్తున విత్తనాలు చల్లించినట్లు వివరించారు. జనవరి 10 నుంచి 12 వరకు విశాఖలో నిర్వహించనున్న పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌-2016ను కూడా ప్రారంభించాలని రాష్ట్రపతిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

రాష్ట్రపతితో చంద్రబాబు

రాష్ట్రపతితో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన ‘నీరు-ప్రగతి' కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరారు. రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ఈ ప్రయత్నానికి మద్దతు పలికి రైతులకు స్ఫూర్తినివ్వాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రపతితో చంద్రబాబు

రాష్ట్రపతితో చంద్రబాబు

డిసెంబర్ 29, 30 తేదీల్లో ఏదో ఒక రోజు వీలుచూసుకొని నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరారు.

రాష్ట్రపతితో చంద్రబాబు

రాష్ట్రపతితో చంద్రబాబు

శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పథకాలను ఆయనకు వివరించారు.

రాష్ట్రపతితో చంద్రబాబు

రాష్ట్రపతితో చంద్రబాబు

చంద్రబాబు వెంట ఏపీ టిడిపి అధ్యక్షుడు కళావెంకటరావు ఉన్నారు. ఆ తర్వాత, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు కూడా సోమవారం రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు.

English summary
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu on Monday invited President Pranab Mukherjee to launch the Andhra Pradesh Government’s ‘Neeru-Pragati’ project in Anantapur, either on December 29 or 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X