వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ ఆలోచన మనకు రాలేదే?: కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు చంద్రబాబు మద్దతు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు తెలుగుదేశం మద్దతు ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ తాను ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్‌ బిల్లుకు ఎంపీలు ఓటు వేసేలా సహకరించాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

టీడీపీ పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈ లేఖపై చంద్రబాబు కాస్తంత సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. కేవీపీ ప్రవేశపెట్టిన ఈ బిల్లు మే 13వ తేదీన చర్చకు రానుంది. ఇందులో భాగంగా కేవీపీ బిల్లుకు పాస్ అయ్యేందుకు ఓటింగ్ గనుక జరిగితే టీడీపీ ఎంపీలు అందుకు అనుకూలంగా ఓటు వేసేలా అధినేత నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

2014 ఎన్నికల్లో తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని, ప్రత్యేకహోదా అంశంపై కూడా హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలును ప్రధాని విస్మరించడంపై కాంగ్రెస్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వంలో టీడీపీ మిత్రపక్షంగా ఉన్నా ఈ బిల్లు విషయంలో టీడీపీ వెనక్కి తగ్గే ఆలోచన కనిపిచండం లేదు. ఎందుకంటే ఈ బిల్లు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాని కల్పించే బిల్లు కాబట్టి. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు, సంస్ధలు ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ అనేక ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ బిల్లుపై టీడీపీ వెనక్కి తగ్గిందంటే మాత్రం చరిత్రి హీనులుగా మిగిలిపోవడం ఖాయం. కాబట్టి చంద్రబాబుకు అనుకూలించే ఈ బిల్లును కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ ప్రవేశపెడుతున్న తప్పక మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మే 13వ తేదీన ఈ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ మొదలవుతుంది. ఈ ఓటింగ్‌కు టీడీపీ ఎంపీలు కూడా మద్దతు తెలపాలని అధినేత చంద్రబాబు ఇప్పటికే సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం రూపొందించిన విభజన బిల్లు చట్ట ప్రకారం ఏపీకి అన్ని నెరవేరుస్తున్నామని కేంద్రం చెబుతోంది.

Naidu likely to support Congress MP KVP’s bill in Rajya Sabha

అయినా ఏపీకి జరగాల్సిన న్యాయం జరగలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో కేంద్రంపై అసంతృప్తి వ్యక్త పరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ బిల్లుకు తన మద్దతు తెలిపి కేంద్రంపై తన అసంతృప్తిని మరోసారి రుజువు చేసుకోవచ్చు.

లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన సాయం కూడా అంతంత మాత్రమే అని చెప్పాలి. ఇటీవల ఏపీకి ప్రత్యేకహోదాపై లోక్‌సభలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఓ ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో ఏపీకి కేంద్రం అండగా నిలిచిందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.

అయితే ఆ దిశగా ప్రయత్నాలు జరగకపోవడంతో కేంద్రంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేవీపీ బిల్లుకు మద్దతు తెలిపడం ఖాయం. ఇటీవల పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ కేవీపీకి వచ్చిన ఆలోచన మనకెందుకు రాలేదని కాస్తంత ఆవేదన కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టడంతో మనం మద్దతు ప్రకటించాల్సి వచ్చిందని, అదే మనకే ఈ ఆలోచన వచ్చి ఉంటే ఇంకా బాగుండేదని చంద్రబాబు నేతల వద్ద అన్నట్లు తెలిసింది.

మోడితో సన్నిహితంగా ఉంటారు, ఆ పని చేయలేరా?: వెంకయ్యకు కేవీపీ లేఖఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ తాన రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు బీజేపీ ఎంపీలు ఓటు వేసేలా సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడికి రాసిన లేఖలో కేవీపీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు రాజ్యసభలో 13వ తేదీన పాస్ అయితే లోక్ సభలో కూడా పాస్ అవడం ఖాయం.

English summary
Signals from the Telugu Desam parliamentary party indicate that many MPs are in favor of extending support to the Congress sponsored private member’s bill in Rajya Sabha on Special Category State status to Andhra Pradesh..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X