nandamuri Balakrishna:మోక్షజ్ఞ తేజను పరిచయం చేసేది ఆయనే: బాలకృష్ణ
nandamuri Balakrishna:తన తనయుడు మోక్షజ్ఞ తేజ సినిమా రంగ ప్రవేశంపై అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు స్పందించారు. గోవా ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీపై మాట్లాడారు. తన కుమారుడిని వచ్చే సంవత్సరం టాలీవుడ్‌లోకి పరిచయం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య స్పష్టతనివ్వలేదు.

బోయపాటి శ్రీను చేతిలోనా?
మోక్షజ్ఞను దర్శకుడు బోయపాటి శ్రీను లాంచ్ చేయనున్నారంటూ వస్తోన్న వార్తలపై బాలకృష్ణ మాట్లాడుతూ.. ''అంతా దైవేచ్ఛ'' అని నవ్వి ఊరుకున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు ఎంట్రీ అలా జరిగిపోతుందని, ఆ దేవుడి అనుగ్రహం లేనిదే ఏదీ జరగదని, ఆ సమయం రావాలని, అప్పటివరకూ మనమంతా వెయిట్ చేయాలంటూ వ్యాఖ్యానించారు. అనంతరం అఖండ-2'పై మాట్లాడారు. 'అఖండ-2' తప్పకుండా ఉంటుందని, దానికి సంబంధించిన సబ్జెక్ట్ కూడా సిద్ధం చేశామని, ప్రకటించడం ఒకటే మిగిలిందని, సమయం చూసి ప్రకటిస్తామని బదులిచ్చారు.

గోవా ఫిలిం ఫెస్టివల్ లో అఖండ
గోవాలో నిర్వహిస్తోన్న 53వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'అఖండ' చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ మేరకు చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి గోవాలో సందడి చేశారు. ఇక, బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీర సింహా రెడ్డి' సినిమా చేస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇది తెరకెక్కుతోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

మొదటిసారిగా స్పందించిన బాలకృష్ణ
బాలకృష్ణ కుమారుడి సినిమా రంగ ప్రవేశంపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నప్పటికీ బాలకృష్ణ ఎప్పుడూ స్పందించలేదు. మౌనం వహించేవారు. గోవా ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న సందర్భంగా తొలిసారి కుమారుడి సినిమాపై మాట్లాడి గాసిప్స్ కు చెక్ పెట్టారు. విలేకరులు ఈ ప్రశ్నలు అడిగే సమయంలో దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణ పక్కనే ఉన్నారు. మీరు పరిచయం చేస్తున్నారా? అని అడగ్గా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోక్షజ్ఞని ఎప్పుడు, ఏ సమయంలో సినిమా రంగ ప్రవేశం చేయించాలనే స్పష్టత ఆ కుటుంబానికి ఉందని, అతని బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఏ దర్శకుడు సెట్ అవుతారో వారే పరిచయం చేస్తారుకానీ నేనే లాంచ్ చేస్తానని గ్యారంటీగా చెప్పలేనన్నారు.












Click it and Unblock the Notifications