హిందూపురం ముస్లింలనుద్దేశించి బాలకృష్ణ ప్రకటన ఇదే

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో ఉన్న ముస్లింలను ఉద్దేశిస్తూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ లేఖలో నియోజకవర్గంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతపురం: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో ఉన్న ముస్లింలను ఉద్దేశిస్తూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ లేఖలో నియోజకవర్గంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రంజాన్ మాసమంతా ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు సాయంత్రం 4గంటలకు పనివేళలు ముగించుకుని వెళ్లిపోవచ్చని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి జీవోను కూడా విడుదల చేయడం జరిగిందని చెప్పారు.

nandamuri balakrishna press note on ramadan

ఎలాంటి ఇబ్బంది, ఆటంకాలు లేకుండా రంజాన్ పవిత్ర ప్రార్థనలు జరుపుకోవాలని కోరారు. వ్యాపారాలు, హోటల్స్ రాత్రి 12గంటల వరకు తెరచి ఉంటాయని తెలిపారు. ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష విరమణ తర్వాత సహకరించవలసినదిగా కోరారు.

కాగా, తన తాజా చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో పోర్చుగల్‌లో బిజీగా గడుపుతున్న బాలకృష్ణ రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఈ నోట్ ద్వారా తన శుభకాంక్షలు తెలపడం గమనార్హం. మే 28న బాలకృష్ణ విడుదల చేసిన ఈ నోట్ తాజాగా వెలుగులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+