అసలు పెళ్లే చేసుకోవాలనుకోలేదు.. కానీ
త్రివిక్రమ్ శ్రీనివాస్ ను స్నేహితుడికన్నా గురువుగానే భావిస్తాను
రాజకీయాల్లో తనకు గురువులెవరూ లేరని, తనలో తానే లోతుగా చర్చించుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రామ్ మనోహర్ లోహియా, అంబేడ్కర్, పూలే, తరిమెల నాగిరెడ్డి పుస్తకాలు బాగా చదివేవాడినని, తనకేదైనా సందేహం కలిగితే వాటిపైన ఆధారపడతానని చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను స్నేహితుడి కన్నా గురువుగానే భావిస్తానని, 'గురు భాయ్' అని పిలుస్తానన్నారు. సినిమాల కన్నా ఎక్కువగా పుస్తకాలు, పురాణాలు, కవిత్వంపైనే త్రివిక్రమ్ తో చర్చ జరుగుతుంటుందన్నారు.

బ్రహ్మచారిగా ఉండి యోగమార్గం అనుకున్నా..
ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న అనస్టాపబుల్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. అందులో మొదటి ఎపిసోడ్ ప్రసారమవుతోంది. ఈ సందర్భంగా బాలకృష్ణతో వివిధ అంశాలపై పవన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. అసలు పెళ్లే చేసుకోవాలనుకోలేదని, బ్రహ్మచారిగా ఉంటూ యోగమార్గాన్ని అనుసరించాలనుకున్నాని, కానీ ఇన్నిసార్లు పెళ్లి జరిగింది తనకేనా అని అనిపిస్తుంటుందన్నారు.

వ్యామోహంతో తాను పెళ్లిచేసుకోలేదు..
ముగ్గురినీ ఒకేసారి పెళ్లిచేసుకోలేదని, ముగ్గురితో ఒకేసారి ఉండట్లేదని, ఒకరితో కుదరలేదు.. ఇంకొకరిని చేసుకోవాల్సి వచ్చింది.. వారితోను కుదరలేదు.. మరొకరిని చేసుకోవాల్సి వచ్చింది. అందరికీ విడాకులిచ్చే ఈ పెళ్లిళ్లు చేసుకున్నానన్నారు. వ్యామోహంతో చేసుకోలేదని, అలా జరిగాయన్నారు. 'ఈ మూడు పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా' అని బాలకృష్ణ ప్రశ్నించగా పవన్ వివరంగా సమాధానమిచ్చారు. తాను సంప్రదాయాల్ని గౌరవిస్తానని, ఇంట్లోవాళ్లు చూశారని తొలిసారి పెళ్లి చేసుకున్నానని, ప్రతి రిలేషన్ షిప్ లో అన్నీ కుదరవుకాబట్టి విడిపోయామని, రెండోసారీ భిన్నాభిప్రాయాలవల్లే విడిపోయామన్నారు.

నాలోని సంస్కారం మాట్లాడనివ్వడంలేదు
మూడు పెళ్లిళ్లంటూ నన్ను విమర్శించే నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి తనకు తెలుసన్నారు. కానీ తనలోని సంస్కారం వాటిగురించి మాట్లాడనివ్వదని, తాను ఎవరినైనా విమర్శించాలంటే వారింట్లో ఆడపడుచులు బాధపడతారని ఆలోచిస్తానననారు. అలాంటి సంస్కారం, విజ్ఞత అవతలి వారికి లేక తన గురించి మాట్లాడతారని, వాటిని తాను ఆపలేనన్నారు. ఈ విషయంలో నాకు ఎలాంటి అపరాధభావం లేదని, తాను ఎక్కువ మందికి తెలియడంతో తన జీవితంలో ఏం జరిగినా ఎక్కువ మందికి తెలుస్తుంది' అని చెప్పారు. పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలకు స్పందించిన బాలకృష్ణ ఇకపై మూడు పెళ్లిళ్లు అంటూ పవన్ ను విమర్శించేవారు 'ఊరకుక్కలతో సమానం' అని బాలకృష్ణ అన్నారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications