ఎన్నికల ఫలితాలపై నందమూరి ఫ్యామిలీ అంచనాలు..!!
ఏపీలో ఎన్నికల ఫలితాల పై ఉత్కంఠ పెరుగుతోంది. హోరా హోరీగా సాగిన ఎన్నికల సమరం పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. జగన్ తాము 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమాగా ఉన్నారు. అటు కూటమి నేతలు తమదే విజయం అని విశ్వాసంతో కనిపిస్తున్నారు. సర్వే సంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు చేస్తున్నాయి. ఇటు పోటీలో ఉన్న అభ్యర్దులు సైతం తమ గెలుపు ఓటమలు పైన లెక్కలు తేల్చుకొనే పనిలో ఉన్నారు.
ఏపీలో ఎన్నికల ఫలితాల పైన నందమూరి రామకృష్ణ స్పందించారు. ఏపీ ఎన్నికల్లో ఎన్నడు కనివిని ఎరుగని, మునుపెన్నడూ చూడని విధంగా ఓటింగ్ జరిగిందన్నారు. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు పక్కనున్న రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తెలుగు వారందరూ ఈ ఓటింగ్ లో పాల్గొనేందుకు కదలి వచ్చారని చెప్పుకొచ్చారు. అలా కదిలి వచ్చిన తెలుగు జాతికి, తెలుగు యువతకి, తెలుగు మహిళలకు, ఓటరు మహాశయులు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు.

ఈ రాక్షస పరిపాలన నుంచి విముక్తి కావడానికి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఎంతో కసితో మీరందరూ భారీ ఎత్తున చాలా దూరాల నుంచి తరలివచ్చారు. మీరందరూ తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు భారీగా ఓట్లు వేసినందుకు కూటమి ప్రభుత్వం ఏర్పడి భారీ మెజారిటీతో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. ఇది తథ్యం అన్నారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థులకు భారీ ఎత్తున ఓట్లు వేసి గెలిపిస్తున్నందుకు యువతీ యువకులకు, ఓటర్లకు నందమూరి కుటుంబం తరపున రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications