నంది అవార్డులపై కీలక ప్రకటన: మెగాస్టార్ విజ్ఞప్తికి ఏపీ ప్రభుత్వ స్పందన

ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మక 'నంది' అవార్డుల సందడి మళ్లీ మొదలుకానుంది. కళాకారులకు తగిన గౌరవం, గుర్తింపు అందించడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనీ, త్వరలోనే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, సినిమా, టెలివిజన్, నాటక రంగాల కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు.

ఇటీవల తెలంగాణలో జరిగిన 'గద్దర్ ఫిలిం అవార్డ్స్' వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కళాకారులను గౌరవించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత వెనుకబడి ఉందంటూ ఆయన తన ఆవేదనను పరోక్షంగా వ్యక్తం చేశారు. చిరంజీవి వంటి పెద్దల నుంచి వచ్చిన ఈ సూచనను సానుకూలంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం, త్వరితగతిన నంది అవార్డుల పునఃప్రారంభానికి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. చిరంజీవి వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి దుర్గేష్ చేసిన ఈ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

Nandi Awards Return AP Minister Kandula Durgesh Announces Revival of Film Awards Following Chiranjeevi Request

విశాఖకు సినీ కళ.. షూటింగ్‌లకు ప్రోత్సాహం

సినిమా నిర్మాణాలకు విశాఖపట్నం కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోందని మంత్రి వెల్లడించారు. నగరంలోని అద్భుతమైన లోకేషన్లను సినీ నిర్మాతలు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తామని, నిర్మాణ సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో సినిమా పరిశ్రమ బలోపేతం అవ్వడమే కాకుండా, స్థానిక కళాకారులకు ఉపాధి దొరకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ

కేవలం సినిమా అవార్డులే కాకుండా, తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా 'నంది నాటకోత్సవాలను' కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అవార్డుల ఎంపిక కోసం త్వరలోనే ఒక ప్రత్యేక జ్యూరీని ఏర్పాటు చేస్తామని, దరఖాస్తుల ప్రక్రియ మరియు విధివిధానాలను అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో టాలీవుడ్‌తో పాటు నాటక రంగ కళాకారుల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+