Vijayawada : విజయవాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీకి ఎదురుదెబ్బ..!
సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా ,నందిగామ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నాలుగో(4) వార్డ్ కౌన్సిలర్ మారం అమరయ్య , 13వ వార్డు కౌన్సిలర్ గద్దె శేషుకుమారి తాము వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.

గతంలో టీడీపీలో ఉన్న అమరయ్యను వైస్ చైర్మన్ పదవి ఆఫర్ ఇచ్చి తమ పార్టీలో చేరుకున్నారు స్థానిక వైసీపీ నేతలు. అయితే వైసీపీలో చేరినప్పటికీ అమరయ్యకు ఎలాంటి పదవి దక్కకపోవడంతో ఆయన తిరిగి తన సొంత గూటికి చేరాలని డిసైడ్ అయ్యారు.

పార్టీని వీడే సమయంలో అమరయ్య వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. వైస్ చైర్మన్ పదవి ఇస్తామని 20 లక్షల రూపాయలు ఖర్చు చేయించి తనని మోసం చేశారని మొండితోక బ్రదర్స్‌పై కౌన్సిలర్ అమరయ్య ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకులు వాడుకొని వదిలేశారని పార్టీని వీడిన ఇద్దరు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

కౌన్సిలర్లు అమరయ్య , గద్దె శేషుకుమారి సోమవారం టీడీపీ నేత కేశినేని చిన్ని సమక్షంలో టీడీపీలో చేరారు. వీరితో పాటు, మరికొంత మంది కౌన్సిలర్లు సైతం టీడీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇదే కనుక జరిగితే నందిగామ చైర్మన్ పదవి టీడీపీ వశం అయ్యే అవకాశం ఉంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో చక్రం తిప్పుతున్న కేశినేని చిన్ని.. వైసీపీ నేతలకు గాలం వేస్తోన్నట్టు సమాచారం అందుతుంది. దీంతో వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు చూస్తున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications