ఓటింగ్ 90శాతానికి మించినా ఆశ్చర్యం లేదు: బ్రహ్మానందరెడ్డి
నంద్యాల ఉపఎన్నికలో బుధవారం మధ్యాహ్నం 3గంటల వరకు దాదాపు 65శాతం వరకు పోలింగ్ జరిగిందని టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తెలిపారు.
కర్నూలు: నంద్యాల ఉపఎన్నికలో బుధవారం మధ్యాహ్నం 3.30గంటల వరకు దాదాపు 65శాతం వరకు పోలింగ్ జరిగిందని టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో 55శాతం కంటే ఎక్కువగానే పోలింగ్ జరిగిందని చెప్పారు.
ఎక్కువశాతం మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో గంటసేపు ఆలస్యమైందని, మిగితా చోట్ల చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

ఈ ఉపఎన్నికలో 80శాతం వరకూ పోలింగ్ జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. 90శాతం పోలింగ్ జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని భూమా బ్రహ్మానందరెడ్డి చెప్పారు. కాగా, బుధవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆగస్టు 28న పోలింగ్ ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications