శిల్పా ఎఫెక్ట్: ఫరూక్‌కు పదవి, నంద్యాల మెజారిటీకి కారణమిదే!
నంద్యాల ఉపఎన్నికల సమయంలో ఇచ్చిన హమీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిలుపుకొన్నారు. శాసనమండలి ఛైర్మెన్ పదవిని ముస్లింకే ఇస్తానని ఇచ్చిన హమీకి కట్టుబడ్డారు.
నంద్యాల: నంద్యాల ఉపఎన్నికల సమయంలో ఇచ్చిన హమీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిలుపుకొన్నారు. శాసనమండలి ఛైర్మెన్ పదవిని ముస్లింకే ఇస్తానని ఇచ్చిన హమీకి కట్టుబడ్డారు. నంద్యాల ఉపఎన్నికల ప్రచారానికి ఒక్క రోజు ముందు ముస్లిం ముఖ్యుల సమావేశంలో చంద్రబాబునాయుడు ఈ హమీని ఇచ్చారు. ఈ హమీ మేరకు ఫరూక్‌కు మండలి ఛైర్మెన్ పదవిని కట్టబెట్టారు.
కర్నూల్ జిల్లాకు మరో పదవి దక్కింది. శాసన మండలి చైర్మన్ పదవి మళ్లీ జిల్లాకే చెందిన మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను వరించింది. 'మండలి' ఛైర్మన్ పీఠం ముస్లింలకే ఇస్తామని నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ రోజే ఆ పదవికి ఫరూక్ పేరు వినిపించింది.
సోమవారం అమరావతిలో జరిగిన పార్టీ జిల్లా నాయకుల సమావేశంలో ఎన్‌ఎండీ ఫరూక్‌ను మండలి ఛైర్మన్‌ను చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.టిడిపి పట్ల విధేయతతో పనిచేసిన ఫరూక్‌కు ఆలస్యంగానైనా పదవులు దక్కాయి.
ఎన్‌టిఆర్ కాలం నుండి ఫరూక్ టిడిపిలోనే కొనసాగారు. చంద్రబాబుకు కూడ ఆయన అత్యంత సన్నిహితంగా ఉన్నారు. పార్టీ పట్ల విధేయుడుగా ఉన్న చంద్రబాబు మంత్రివర్గంలో పలు మంత్రి పదవులు నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్‌గా కూడ పనిచేశారు.

విధేయతకే పట్టం కట్టిన బాబు
తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు.. నేటి సీఎం చంద్రబాబుకు ఫరూక్ అత్యంత సన్నిహితుడుగా మెలుగుతూ వచ్చారు. పార్టీలో విధేయుడుగా ఉంటూ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సామాన్య కార్యకర్తలా పని చేస్తూ వచ్చిన ఆయనకు పార్టీ అధినాయకత్వం సముచిత స్థానం కల్పించింది.ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు మంత్రివర్గాల్లో ఫరూక్ మంత్రిగా పనిచేశారు. పార్టీ సంక్షోభ సమయంలో కూడ ఆయన పార్టీని వీడలేదు. పార్టీని వెన్నంటి ఉన్నారు. ఫరూక్‌ను కాదని బాబు శిల్పాకు 2014లో టిక్కెట్టు ఇచ్చినా ఆయన పార్టీ అధినేత సూచనల ప్రకారంగా వ్యవహరించారు. నంద్యాల ఉపఎన్నికల సమయంలో కూడ భూమా కుటుంబానికి మద్దతు ప్రకటించారు. దీంతో బాబు ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవితో పాటు మండలి ఛైర్మెన్ పదవిని కూడ కట్టబెట్టారు.

తొలిసారే ఎన్నికల్లో విజయం
టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983లో జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా సంజీవ రెడ్డి గెలుపొందారు. రెండేళ్లకే 1985లో వచ్చిన ఎన్నికల్లో ఎన్టీఆర్ మైనార్టీ వర్గానికి చెందిన ఎన్‌ఎండీ ఫరూక్‌ను నంద్యాల నుంచి బరిలో దింపారు. రాజకీయ అరంగేట్రం చేసిన తొలి ఎన్నికల్లోనే గెలిచి శాసనసభలో అడుగు పెట్టారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకు న్నారు. కేబినెట్ మంత్రిగా మంచి గుర్తింపు పొందారు. 1989 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఫరూక్.. 1994 ఎన్నికల్లో నంద్యాల నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభ ఉప సభాపతిగా పదవి చేపట్టారు. ఎన్టీఆర్, చంద్రబాబు ఇద్దరికి అత్యంత సన్నిహితుడుగా మెలుగుతూ వచ్చిన ఈయన 1999లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నాడు చంద్రబాబు మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా బాద్యతలు చేపట్టారు.2004,2009లలో ఆయన నంద్యాల నుండి పోటీచేసి ఓటమిపాలయ్యారు.

ఐదుసార్లు పోటీచేసి రెండు సార్లు ఓటమి
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంలో నంద్యాల నుండి మంత్రిగా పనిచేసిన తొలి వ్యక్తి ఫరూక్. 2004లో బరిలో దిగి కాంగ్రెస్ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. 2009లో నంద్యాల పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎస్పీవై రెడ్డి చేతిలో ఓటమి చెందారు. అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల నుంచి 5 పర్యాయాలు పోటీ చేస్తే మూడు పర్యాయాలు విజయం సాధించారు ఫరూక్. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో రెండుసార్లు క్యాబినెట్ మంత్రిగా, ఒక పర్యాయం ఉప సభాపతిగా బాధ్యతలు నిర్వహించారు.

భూమా కుటుంబానికి అండగా
నంద్యాల ఉప ఎన్నికలో కీలకంగా వ్యవహరించారు ఫరూక్. శిల్పా మోహన్‌రెడ్డి టిడిపిలో ఉన్న సమయంలో తనకే టిక్కెట్టు కావాలంటూ శిల్పా మోహన్‌రెడ్డి పార్టీ నాయకత్వాన్ని పట్టుబడితే ఫరూక్ భూమా కుటుంబానికి అండగా నిలిచారు. శిల్పాకు టిక్కెట్టు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. నంద్యాల ఉప ఎన్నికకు ముందు రెండు పర్యాయాలు నంద్యాలకు వచ్చిన ముఖ్యమంత్రి ఫరూక్‌తో ఏకాంతంగా సమావేశమయ్యారు. ముస్లిం మైనార్టీ ఓట్లు 55వేలకు పైగా ఉండడంతో పార్టీ అభ్యర్థి గెలుపు కీలక బాధ్యతను ఫరూక్‌కే అప్పగించారు. ఈ ఎన్నికలో భారీ మెజార్టీ వచ్చేందుకు ఫరూక్ కీలకంగా పనిచేశారు.

ఫరూక్‌కే మండలి ఛైర్మెన్ పదవి వెనుక.
నంద్యాల టిడిపి ఇంచార్జీ శిల్పా మోహన్‌రెడ్డి టిడిపిని వీడారు. ముస్లింలు నంద్యాలలో గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారు. ఈ సమయంలో శిల్పా చక్రపాణిరెడ్డికి ఇస్తానన్న మండలి ఛైర్మెన్ పదవిని కూడ ఫరూక్‌కు ఇవ్వాలని బాబు నిర్ణయం తీసుకొన్నారు. నంద్యాల ఎన్నికల ప్రచారానికి రావడానికి ఒక్కరోజు ముందు అమరావతిలోనే ముస్లింలకు మండలి ఛైర్మెన్ పదవిని ఇవ్వనున్నట్టు ప్రకటించారు.నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో కూడ ఈ విషయాన్ని తేల్చి చెప్పారు.
ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే సీఎం చంద్రబాబు ఫరూక్‌తో పాటు నంద్యాల నాయకులతో అమరావతిలో సమావేశమయ్యారు. టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుని వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మాట ఇచ్చారు. ఇందులో భాగంగానే గవర్నర్ కోటా కింద ఫరూక్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి చంద్రబాబు ఎన్‌ఎంఢీ ఫరూక్‌ను మండలి చైర్మన్ చేస్తున్నట్లు అమరావతిలో ప్రకటించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications