'బలవంతంగా పదవి, నోరు కట్టేశారు.. నాలుగేళ్ల తర్వాత పిచ్చాసుపత్రిలో'
'నాలుగేళ్ల తర్వాత పిచ్చాసుపత్రికి వచ్చి నన్నపనేని రాజకుమారి ఎక్కడుందంటే ఎవరైనా చెబుతారని' దేవినేనికి బదులిచ్చినట్టుగా నన్నపనేని చెప్పారు.
గుంటూరు: వద్దన్నా.. బలవంతం చేసి మరీ తనకు చైర్మన్ పదవి కట్టబెట్టారంటూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. మంత్రి ఉమామహేశ్వరరావు బలవంతం మీద తాను పదవి చేపట్టినట్టు తెలిపారు.
గురువారం రాత్రి సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయంలో జరిగిన సభలో నన్నపనేని రాజకుమారి మాట్లాడారు. పదవి కట్టబెట్టి తన నోరు కట్టిపడేశారని నన్నపనేని పేర్కొనడం గమనార్హం. పార్టీ కార్యక్రమాలు, టీవీ చర్చలు.. ఇలా ఏ కార్యక్రమంలోను పాల్గొనడం, మాట్లాడటం చేయకూడదని పార్టీ ఆదేశించినట్టుగా తెలిపారు.

ఇదే విషయంపై ఇటీవల దేవినేని ఉమ తనతో మాట్లాడారని నన్నపనేని అన్నారు. పదవి ఎలా ఉందని దేవినేని అడిగారని.. 'నాలుగేళ్ల తర్వాత పిచ్చాసుపత్రికి వచ్చి నన్నపనేని రాజకుమారి ఎక్కడుందంటే ఎవరైనా చెబుతారని' బదులిచ్చినట్టుగా చెప్పారు. మహిళా కమిషన్ చైర్మన్ పదవిలో చాలా సమస్యలు ఉన్నట్టుగా నన్నపనేని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications