రంగంలోకి బ్రాహ్మణి, తొలి అడుగు - పార్టీలో కీలక బాధ్యతలు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ చంద్రబాబు అరెస్ట్ ను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో అనూహ్యంగా భువనేశ్వరి..బ్రాహ్మణి రాజమండ్రిలోనే బస చేసారు. అటు లోకేశ్ అరెస్ట్ ఖాయమని వైసీపీ మంత్రులు చెబుతున్న వేళ..పార్టీలో కీలక బాధ్యతల దిశగా నారా బ్రాహ్మణి సిద్దం అవుతున్నారు.

టీడీపీలో కీలక పరిణామాలు:చంద్రబాబు అరెస్ట్ తో ఒక్క సారిగా టీడీపీ షాక్ కు గురైంది. అదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తును పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని వెల్లడించారు. బీజేపీ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. టీడీపీతో పొత్తు దిశగా ఇప్పటికే ప్రయత్నాలు చేసిన పవన్...

Nara Barahmani to take Active role in TDP amid Chandra Babu Arrest, Cases oon Lokesh

ఇప్పుడు పొత్తు ప్రకటన వెనుక కారణాలను వివరిస్తానని చెబుతున్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణలో బిజీగా ఉన్న బీజేపీ నాయకత్వం ఆ తరువాతనే ఏపీ వ్యవహారాల పైన ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ పైన ఇప్పటి వరకు బీజేపీ నేతలు ఎక్కడా స్పందించకపోవటం కొత్త చర్చకు కారణమవుతోంది.

రంగంలోకి నారా బ్రాహ్మణి:ఇక, చంద్రబాబు తరువాత లోకేశ్ అరెస్ట్ ఖాయమని మంత్రులు చెబుతున్నారు. దీంతో, టీడీపీ అలర్ట్ అయింది. ఈ సమయంలో బ్రాహ్మణి పాత్ర కీలకం కానుంది. ఇప్పటికే రాజమండ్రిలో చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ర్యాలీల్లో పాల్గొంటున్న బ్రాహ్మణి తొలి సారి వైసీపీ పైన నేరుగా విమర్శలు చేసారు. అదే సమయంలో ఏ రోజు బయటకు రాని భువనేశ్వరి బయటకు వచ్చారని..

రాష్ట్ర ప్రజలంతా తమ కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. రేపు లోకేశ్ ను అరెస్ట్ చేసినా భయపడే ప్రసక్తే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీని ద్వారా బ్రాహ్మణి ఏ పరిణామాలనైనా ఎదుర్కోవటానికి సిద్దంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇందుకోసం పార్టీ లో బ్రాహ్మణికి కీలక బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

పార్టీలో కీలక బాధ్యతలు:నారా బ్రాహ్మణి ప్రజల్లోకి వెళ్తే సానుకూలత పెరుగుతోందని టీడీపీ అంచనా వేస్తోంది. బ్రాహ్మణి ఇప్పటి వరకు రాజకీయంగా ఎప్పుడు మాట్లాడలేదు. హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్టు కార్యకలాపాలకే పరిమితం అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తో భువనేశ్వరితో కలిసి నిరసన ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఇక, ప్రచారం సాగుతున్నట్లుగా లోకేశ్ అరెస్ట్ జరిగితే బ్రాహ్మణి ఈ అరెస్టుల వ్యవహారామే ప్రచారాస్త్రంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

పార్టీలో బ్రాహ్మణి పాత్ర ఎలా ఉండాలి.. ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది రానున్న రోజుల్లో చోటు చేసుకొనే పరిణామాల ఆధారంగా నిర్ణయించనున్నారు. దీంతో, రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో..ముఖ్యంగా టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+