నేను హామీ ఇస్తున్నా - పార్టీ నేతలతో భువనేశ్వరి సమావేశం..!!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తొలి సారి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును కలిసిన భువనేశ్వరి ఆ వెంటనే పార్టీ కేడర్ కు భరోసా ఇచ్చారు. ఇప్పుడు తనయుడు లోకేశ్ తో కలిసి తాజా పరిస్థితులపైన సమీక్షించారు. నారా - నందమూరి కుటుంబాల తరపున హామీ ఇచ్చారు. పోరాటం సాగిస్తామని చెప్పారు.

చంద్రబాబు అరెస్ట్ తో ఒక్కసారిగా టీడీపీలో కలకలం మొదలైంది. పార్టీ ఎలా స్పందించాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. లోకేశ్ సైతం చంద్రబాబు అరెస్ట్ పైన మూడో రోజు స్పందించారు. సీనియర్లకు సైత ఏం జరుగుతుందో అంతు చిక్కలేదు. పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతోందనే ఆందోళన వారిలో కనిపించింది. చంద్రబాబు అరెస్ట్ తో పార్టీలో సరైన రీతిలో స్పందన కనిపించలేదనే అభిప్రాయం ఉంది. ఈ సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా మీడియా సమావేశాల్లో స్టేట్ మెంట్స్ ఇచ్చిన నేతలు క్షేత్ర స్థాయిలో మాత్రం కేడర్ మధ్యకు వెళ్లలేదు. బంద్ కు జనసేన మద్దుత ఇచ్చినా అంతంత మాత్రంగానే సక్సెస్ చేసారనే అభిప్రాయం ఉంది.

Nara Bbuvaeswari meets TDP Leaders, Review the situation after Cahndra Babu Arrest

ఈ సమయంలో నందమూరి బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. అటు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబును సతీమణి భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి కలిసారు. దాదాపు 40 నిమిషాలు అక్కడే ఉన్నారు. ఆ తరువాత మాట్లాడిన భువనేశ్వరి ఎన్టీఆర్ నిర్మించిన టీడీపీ ఎక్కడకు పోదని చెప్పుకొచ్చారు. ఈ కుటుంబం ఎప్పుడూ పార్టీ కేడర్ కోసం ..ప్రజల కోసం పోరాడి నిలుస్తుందని పేర్కొన్నారు. తమ కుటుంబానికి ఇది కష్ట సమయంగా చెప్పుకొచ్చారు. రాజమండ్రిలోనే భువనేశ్వరి, లోకేశ్ బస చేసారు. పార్టీ ముఖ్యులు వారిని కలుస్తున్నారు. ఇటు పార్టీ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమైన బాలయ్య..ఈ రోజు రాజమండ్రికి చేరుకుంటున్నారు.

ఇక, పార్టీ నేతలతో తొలి సారిగా తనయుడు లోకేశ్ తో కలిసి భువనేశ్వరి సమావేశం అయ్యారు. ఆ సమయంలో ప్రస్తుత పరిణామాల పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో పార్టీ కోసం అందరూ కలిసి కట్టుగా పని చేయాలని భువనేశ్వరి సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎప్పుడూ పార్టీ వ్యవహారాలు...రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోని భువనేశ్వరి ఇప్పుడు పార్టీ నేతలతో సమావేశం కావటం ఆసక్తి కరంగా మారింది. అటు హైకోర్టులో చంద్రబాబు పిటీషన్లు 19వ తేదీకి వాయిదా వేయటంతో..వాటి పైన కోర్టులో నిర్ణయం వచ్చిన తరువాతనే చంద్రబాబు విడుదలకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో, చంద్రబాబు వ్యవహారంలో జరుగుతున్న న్యాయ ప్రక్రియ...పార్టీలో పరిణామాల పైన ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+