కుప్పంకు బంపర్ ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు, నారా భువనేశ్వరి స్వయంగా క్లారిటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సొంత నియోజక వర్గం కుప్పంకు వరాలజల్లు కురిపించారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు రూ. 250 కోట్ల గ్రాంటు ఇవ్వనున్నారని, ఈ విషయాన్ని స్వయంగా నన్ను చెప్పమన్నారని, ఈ నిధులతో కుప్పం పట్టణం సమగ్రాభివృద్ధి చెందుతుంది అని నారా భువనేశ్వరి అన్నారు.
కుప్పంలో టీడీపీ మున్సిపల్ నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లతో నారా భువనేశ్వరి సమావేశం అయ్యి అనేక విషయాలు, పలు అభివృద్ధి పనులపై వారితో చర్చించారు. టీడీడీ కార్యకర్తల కష్టాన్ని చంద్రబాబు కానీ, లోకేశ్ కానీ, తాను కాని ఏనాడూ మరచిపోలేదని నారా భువనేశ్వరి అన్నారు. వైసీపీ అయిదేళ్ల పాలనలో టీడీపీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పార్టీ కోసం తమ జీవితాలను త్యాగం చేశారని నారా భువనేశ్వరి ఇదే సమయంలో గుర్తు చేశారు.

సీఎంగా రాష్ట్రంలోని సమస్యలు మొత్తం చూసుకుంటూ బిజీగా ఉంటున్న చంద్రబాబు కుప్పంకు రాలేకపోయినా తాను మాత్రం రెండు నెలలకు ఒకసారి కుప్పంకు వస్తానని, ఇక్కడి ప్రజల సమస్యలు, పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని నారా భువనేశ్వరి కుప్పం ప్రజలకు హామీ ఇచ్చారు. నారా లోకేష్ కూడా వీలు చూసుకుని కుప్పం వస్తారని, మీకు అందుబాటులో ఇక్కడ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, మునిరత్నం నిత్యం అందుబాటులో ఉంటారని నారా భువనేశ్వరి కుప్పం నియోజక వర్గం టీడీపీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు.
పార్టీ కోసం, చంద్రబాబు కోసం కష్టపడిన ప్రతి టీడీపీ కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని, కుప్పం మున్సిపాలిటీలో మనకు 12 వేల మెజారిటీ రావడం ఆనందంగా ఉందని నారా భువనేశ్వర ఆనందం వ్యక్తం చేశారు. టీడీపీ కుప్పం మున్సిపల్ శాఖ అధ్యక్షుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సృష్టించిన అరాచకాలకు, అన్యాయాలకు కార్యకర్తలు భయపడిపోయారని అన్నారు. ఇక పెద్దిరెడ్డి అరాచకాలు అడ్డుకుంటామనే ధైర్యం వచ్చిందని టీడీపీ నాయకులు నారా భువనేశ్వరికి చెప్పారు.
పెద్దిరెడ్డి అనుచరుల బెదిరింపులకు ఒకానొక సమయంలో నిరాశకు గురైన విషయం వాస్తవమేనని కుప్పం టీడీపీ నాయకులు నారా భువనేశ్వరికి చెప్పారు. తరువాత ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఇచ్చిన ధైర్యంతో తేరుకుని పోలింగ్ బూత్‌లవద్ద ధైర్యంగా నిలబడి మా నాయకుడు చంద్రబాబు నాయుడికి విజయం సాధించిపెట్టామని టీడీపీ నాయకులు నారా భువనేశ్వరికి చెప్పారు. కుప్పంలో పార్టీలో ఉన్న చిన్నచిన్న సమస్యలు అన్నీ పరిష్కరించడానికి త్వరలో చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం టీడీపీ నాయకులు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications