వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని రైతులకు మద్దతుగా భువనేశ్వరి: చంద్రబాబుతో కలిసి ఆ గ్రామాల్లో: కొత్త సంవత్సరం తొలి నాడు..!

|
Google Oneindia TeluguNews

నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన టీడీపీ అధినేత చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున మరోసారి అమరావతి తరలింపు ప్రతిపాద న కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ సారి తనతో పాటుగా సతీమణి భువనేశ్వరిని సైతం తీసుకెళ్తున్నారు. రాజధాని గ్రామాల్లో రైతుల కుటుంబాలకు చెందిన మహిళ లు పెద్ద సంఖ్యలో ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వారికి మద్దతుగా భువనేశ్వరిని తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికే రాజధాని రైతుల నిరసన శిబిరాల వద్దకు వెళ్లి..వారికి మద్దతు ప్రకటించిన చంద్రబాబు..రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అసలు ఆ అధికారం సీఎం జగన్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. తాజాగా.. మీడియా పై దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులను జైలుకు వెళ్లి చంద్రబాబు పరామర్శించారు. పార్టీ నేతలు సైతం రాజధాని తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు భువనేశ్వరిని సైతం రాజధాని గ్రామాల మహిళలకు మద్దతుగా తీసుకొస్తుండటంతో ఈ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది.

సతీ సమేతంగా చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త సంవత్సరం ఆరంభం రోజున వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. పార్టీ నేతలకు..కేడర్ కు సైతం అదే సూచించారు. తన కోసం ఎవరూ బోకేలు..కేకులు తీసుకు రావద్దని స్పష్టం చేసారు. ఆ మొత్తం ఆందోళనలో ఉన్న రైతులకు అందించాలని సూచించారు. టీడీపీ మొత్తంగా కొత్త సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇదే సమయంలో కొత్త సంవత్స ర ప్రారంభం రోజున రైతులకు మద్దతుగా తన సతీమణి భువనేశ్వరితో కలిసి వారు ఆందోళన చేస్తున్న ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆ ప్రాంతంలో ధర్నాల్లో పాల్గొంటున్నారు. దీంతో...భువనేశ్వరిని వారికి సంఘీభావం ప్రకటించేలా చంద్రబాబు నిర్ణయించారు. తుళ్లూరు..వెలగపూడి..మందడం గ్రామాల్లో వీరి పర్యటన ఉండనుంది.

Nara Bhuvaneswari going to support farmers in Amaravati on their agitation against capital shifting

ప్రభుత్వానికి వ్యతిరేకంగా..
ఇప్పటికే చంద్రబాబు అమరావతి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనల మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ మారినప్పుడల్లా రాజధాని మార్చే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానులు దేశంలో ఎక్కడైనా ఉందా అంటూ నిలదీస్తున్నారు. మంత్రుల ప్రకటన మీద చంద్రబాబు మండిపడుతున్నారు. జీఎన్ రావు కమిటీ..జీసీబీ కమిటీల పైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం మీద చంద్రబాబు తాజాగా పార్టీ నేతలతో టెలి కాన్ఫిరెన్స నిర్వహించారు. బుధవారం ప్రకాశం జిల్లా నుండి టీడీపీ నేతలు రాజధాని గ్రామాలకు వచ్చి రైతులకు మద్దతు ప్రకటించనున్నారు. ఇప్పుడు..స్థానిక మహిళలకు మద్దతుగా భువనేశ్వరి సైతం వస్తుండటంతో ఈ పర్యటన పైన రాజకీయంగా ఆసక్తి నెలకొని ఉంది.

English summary
CBN decided to visit amaravati farmers along with his wife Bhuvaneswari on new year day. CBN opposing three capital proposal. He suggested party leaders to do not participate in new year celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X