బడ్జెట్‌పై బాబు అలా, బాగుందని ప్రశంసించిన బ్రాహ్మణి: పార్థసారథి ఆగ్రహం
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోడలు, మంత్రి నారా లోకేష్ కోడలు నారా బ్రాహ్మణి స్పందించారు. ఆమె విశాఖలో మాట్లాడారు.
బడ్జెట్ పైన ఓవైపు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బ్రాహ్మణి మాత్రం మరో రకంగా స్పందించారు. అయితే ఆమె పారిశ్రామిక కోణంలో ఆలోచించి స్పందించారు.

మోడీ ప్రభుత్వానికి బ్రాహ్మణి కితాబు
బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు బాగున్నాయని బ్రాహ్మణి కితాబిచ్చారు. ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు పెద్ద పీట వేయడం శుభ పరిణామమని ఆమె తెలిపారు. కిసాన్ కార్డులు వ్యవసాయదారులకే కాకుండా ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు.

హెరిటేజ్ ఫుడ్స్ ఈడీగా
అలాగే, ఈ ఏడాది మత్స్య, పాడి పరిశ్రమ కోసం మరో 10 వేల కోట్లు అదనంగా కేటాయించారని బ్రాహ్మణి చెప్పారు. ఇది కూడా బాగుందని చెప్పారు. కాగా, ఏపీకి సరైన కేటాయింపులు లేవంటూ తెలుగుదేశం కేంద్రంపై నిప్పులు చెరుగుతోన్న విషయం తెలిసిందే. హెరిటేజ్ ఫుడ్స్ ఈడీగా బ్రాహ్మణి మాత్రం మరోరకంగా స్పందించారు.

సీనియార్టీ అర్థమైంది.. పార్థసారథి ఆగ్రహం
చంద్రబాబుపై వైసీపీ నేత పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఏం సాధించలేకపోయారన్నారు. ఆయన సీనియారిటీ ఏమిటో ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమైందన్నారు. నాలుగేళ్లుగా బాబు ప్రజలను మోసం చేస్తున్నారని, విభజన వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని చెబుతున్న బాబు అటు వరంగల్, ఇటు హైదరాబాద్ వెళ్లిప్పుడు న వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతారని ఎద్దేవా చేశారు.

మమ్మల్ని చూసి ఒత్తిడి చేయడం లేదేం
కేంద్రంతో సంబంధాలు బాగున్నాయని ఇప్పటి వరకు చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చారని పార్థసారథి అన్నారు. ఈ ఏడాదే కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందా అని నిలదీశారు. బడ్జెట్ పైన బాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, ఏపీ కోసం తాము నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. మా పోరాటం చూసి కేంద్రంపై బాబు ఎందుకు ఒత్తిడి చేయడం లేదన్నారు.

కేసుల కోసమే ఢిల్లీ వెళ్లారు
24సార్లు ఢిల్లీ వెళ్లారని టీడీపీ నేతలు చెబుతున్నారని, తనపై ఉన్న కేసుల కోసమే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని అర్థమవుతోందన్నారు. ప్రతిపక్షంగా తాము చెప్పింది ఏనాడూ చంద్రబాబు వినలేదన్నారు. విభజన హామీలపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం తానే కడతానని చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా అరకొర నిధులు ఇస్తుంటే ఎందుకు అడగలేదని నిలదీశారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications