నారా లోకేష్ వర్సెస్ డీకే శివకుమార్ ..! బెంగళూరు కంపెనీపై మాటల తూటాలు..!
ఏపీ మంత్రి నారా లోకేష్ కూ, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూ మధ్య అనూహ్యంగా ఓ పరోక్ష మాటల యుద్ధం సాగుతోంది. బెంగళూరులో రోడ్ల పరిస్ధితులపై ఓ లాజిస్టిక్ కంపెనీ సీఈవో పెట్టిన ట్వీట్ కు లోకేష్ స్పందించి ఏపీకి ఆహ్వానించగా... ఇలాంటి బెదిరింపులు పట్టించుకోమంటూ డీకే శివకుమార్ జవాబిచ్చారు. దీంతో లోకేష్ తిరిగి స్పందిస్తూ డీకే శివకుమార్ కు పరోక్షంగా పంచ్ ఇచ్చారు.
తాజాగా బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్, గుంతలపై స్పందిస్తూ స్థానిక బ్లాక్ బక్ లాజిస్టిక్ కంపెనీ సీఈవో రాజేష్ యాబాజీ ఎక్స్ లో ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన తమ ఆఫీసుకు రావాలంటే ఉద్యోగులకు రోడ్ల కారణంగా గంటన్నర సమయం పడుతుందని, ఐదేళ్లుగా ఇదే పరిస్ధితి ఉందని, ఇక తాము వేరే చొటికి వెళ్ళిపోతామంటూ ఎక్స్ లో రాజేష్ ట్వీట్ చేశారు. దీంతో ఏపీకి కంపెనీల్ని ఆహ్వానించేందుకు సిద్దంగా ఉన్న మంత్రి నారా లోకేష్ స్పందించారు.
Hi Rajesh, can I interest you in relocating your company to Vizag? We are rated among top 5 cleanest cities in India, are building best-in-class infra, and have been rated the safest city for women. Please send me a DM. https://t.co/HLfP2CVTys
— Lokesh Nara (@naralokesh) September 17, 2025

రాజేష్ ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. ఏపీకి రావాలని మంత్రి నారా లోకేష్ ఆయన్ను ఆహ్వానించారు. విశాఖ రావాలని, ఈ నగరం దేశంలోనే ఐదు అత్యుత్తమ పరిశుభ్రమైన నగరాల్లో ఒకటని తెలిపారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపరుస్తున్నట్లు లోకేష్ వెల్లడించారు. అలాగే మహిళలకు సురక్షిత నగరంగా కూడా విశాఖకు పేరుందన్నారు. తన ట్వీట్ పై స్పందించి నేరుగా తనకు రిప్లై ఇవ్వాలని కోరారు. అయితే లోకేష్ ట్వీట్ కు వెంటనే రిప్లై రాలేదు కానీ కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు.

బ్లాక్ బక్ సంస్థ సీఈవో రాజేష్ ట్వీట్, దానికి ఏపీ మంత్రి లోకేష్ రియాక్షన్ చూసిన డీకే శివకుమార్.. ఇలాంటి బెదిరింపుల్ని, బ్లాక్ మెయిలింగ్ ను కనీసం పట్టించుకోబోమని తేల్చిచెప్పేశారు. బెంగళూరు నగరం ఇప్పటికే పరిశ్రమలకు ఆకర్షణీయంగా ఉందన్నారు. అలాగే సీఈవో రాజేష్ చెప్పిన రోడ్ల మరమ్మత్తులకు 1100 కోట్లు కేటాయించినట్లు కూడా శివకుమార్ తెలిపారు. దీంతో పాటు గుంతలు పూడ్చేందుకు కాంట్రాక్టర్ కు నవంబర్ వరకూ సమయం ఇచ్చామన్నారు.
Here’s what sets AP apart from others - we don’t dismiss our people’s genuine grievances as ‘Blackmail’. We treat them with the dignity and seriousness they deserve. https://t.co/ZszTXYEeqG
— Lokesh Nara (@naralokesh) September 18, 2025
దీనిపై తిరిగి ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. డీకే శివకుమార్ పేరెత్తకుండానే తమ ప్రజల ఫిర్యాదుల్ని బ్లాక్ మెయిల్ అని తోసిపుచ్చలేమంటూ లోకేష్ జవాబిచ్చారు. తాము వాటిని మర్యాదపూర్వకంగా స్వీకరించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామంటూ లోకేష్ తెలిపారు. దీంతో లోకేష్ పంచ్ అదిరిందంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
-
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications