ఒకే ఒక్క ప్రకటనతో మారిన ఏపీ రాజకీయ చిత్రం! లోకేష్‌కు పట్టాభిషేకం
తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానంలో ఒక మైలురాయి లాంటి ఘట్టం ఆవిష్కృతమైంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంలో, కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉండటంలో తనదైన శైలిని చాటుకున్న నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించారు. టీడీపీ జాతీయ కార్యనిర్వాహక వర్గంలో కీలక మార్పులు చేస్తూ, లోకేష్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చంద్రబాబు ప్రకటించారు. ఈ నిర్ణయంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
నారా లోకేష్ ప్రయాణం పార్టీలో అంచెలంచెలుగా సాగింది. తొలుత పార్టీ ఐటీ విభాగం బాధ్యతలు చేపట్టి, డిజిటల్ యుగంలో టీడీపీని ముందు వరుసలో నిలబెట్టారు. ఆ తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, పార్టీ అంతర్గత వ్యవహారాలపై పట్టు సాధించారు. ముఖ్యంగా 'కార్యకర్తల సంక్షేమ నిధి' ద్వారా వేలాది మంది కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచి, వారిలో భరోసా నింపారు. 'యువగళం' పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న ఆయన, ఇప్పుడు పార్టీని జాతీయ స్థాయిలో నడిపించేందుకు సిద్ధమయ్యారు.

కార్యకర్తల కల నెరవేరిన వేళ!
లోకేష్‌కు పార్టీలో ఉన్నత బాధ్యతలు అప్పగించాలని గత కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు. చంద్రబాబు పాలనపై దృష్టి సారిస్తున్న తరుణంలో, పార్టీ సమన్వయ బాధ్యతలను లోకేష్ చూసుకోవడం వల్ల కేడర్‌కు మరింత వేగంగా న్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్ బాధ్యతలు చేపట్టడం ద్వారా, అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ యువతకు పెద్దపీట వేసినట్లయింది.
సంచలనానికి తెర..
ఈ కమిటీల కూర్పులో చంద్రబాబు ఒక సంచలనానికి తెరతీశారు. సాధారణంగా సీనియర్ నేతలకు మాత్రమే దక్కే 'పొలిట్‌బ్యూరో' స్థానాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలకు అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్‌ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్‌లను నేరుగా పొలిట్‌బ్యూరో సభ్యులుగా నియమించడం ద్వారా.. "పార్టీ కోసం కష్టపడే సామాన్య కార్యకర్తకు అత్యున్నత పదవి దక్కుతుంది" అనే బలమైన సంకేతాన్ని పంపారు.
బడుగు బలహీన వర్గాల 'పసుపు' కోట!
సామాజిక సమీకరణాల విషయంలో టీడీపీ తన పాత రికార్డులను తానే తిరగరాసింది. 185 మందితో కూడిన రాష్ట్ర కమిటీలో ఏకంగా 122 స్థానాలను బడుగు, బలహీన వర్గాలకే (BC, SC, ST, Minorities) కేటాయించారు.
- బీసీలకు సింహభాగం: రాష్ట్ర కమిటీలో బీసీలకు 77 స్థానాలు కల్పించడం ద్వారా పార్టీకి బీసీలే వెన్నెముక అని మరోసారి నిరూపించారు.
- మహిళా సాధికారత: రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలకు చోటు కల్పించడమే కాకుండా, పొలిట్‌బ్యూరోలోనూ వారికి సముచిత స్థానం కల్పించారు.
- ఎస్‌సీలకు 25, మైనార్టీలకు 13, ఎస్‌టీలకు 7 స్థానాలు కేటాయించి అన్ని వర్గాలకు న్యాయం చేశారు.
కొత్త కమిటీల స్వరూపం: జాతీయ నుండి క్షేత్రస్థాయి దాకా!
పల్లా శ్రీనివాస్‌ను ఏపీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూనే, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేష్ కిలార్‌లను నియమించారు.
పొలిట్‌బ్యూరో: 29 మంది సభ్యులు.
జాతీయ కమిటీ: 31 మంది సభ్యులు.
రాష్ట్ర కమిటీ: 185 మంది సభ్యులు.
జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందికి చోటు దక్కింది. నామినేటెడ్ పదవులు దక్కని వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యతనిస్తూ చంద్రబాబు సమతుల్యత పాటించారు.
2029కి పక్కా ప్రణాళిక..
ఈ కమిటీల కూర్పు కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాదు, 2029 ఎన్నికల కోసం చంద్రబాబు వేసిన పక్కా వ్యూహం. రాబోయే ఐదేళ్లలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసే బాధ్యతను లోకేష్‌కు అప్పగించినట్లు కనిపిస్తోంది. విధేయత, కష్టపడే తత్వం, మరియు ప్రాంతీయ సమీకరణాలను బేరీజు వేసి రూపొందించిన ఈ కొత్త టీమ్.. అటు ప్రజల్లోనూ, ఇటు కార్యకర్తల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!














Click it and Unblock the Notifications