కర్నూలు అభ్యర్థులుగా బుట్టా, ఎస్వీలను ప్రకటించిన లోకేష్: పవన్‌కు కౌంటర్

కర్నూలు: జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను సోమవారం ప్రకటించారు. కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిలను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వీరు పోటీ చేస్తారని, మంచి మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

కర్నూలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అర్థంలేని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. లేదంటే తనపై చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు చూపించాలని నిలదీశారు.

Nara Lokesh confirms Kurnool MLA and MP for 2019 elections

తన అవినీతిపై పవన్ పదేపదే ఆరోపణలు చేస్తున్నారని, అవి ఉంటే కనుక పవన్ ప్రజల ముందు పెట్టాలన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వంటి ప్రతిపక్షాలు కూడా నిరాధార ఆరోపణలు చేస్తున్నాయన్నారు. బీజేపీ నాయకులకు రాయలసీమపై ప్రేమ ఉంటే కర్నూలను దేశ రెండో రాజధానిగా ఎందుకు చేయడం లేదో చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+