నారా దేవాన్ష్ పుట్టిన రోజు: టీటీడీకి లోకేష్-బ్రాహ్మణి విరాళం
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్-నారా బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ పుట్టిన రోజు(మార్చి 21) సందర్భంగా టీటీడీకి భారీ విరాళం అందించారు.
తిరుపతి: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్-నారా బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ పుట్టిన రోజు(మార్చి 21) సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కు భారీ విరాళం అందించారు. ఒక రోజు అన్నప్రసాద వితరణకు రూ. 33 లక్షల విరాళాన్ని నారా లోకేష్-బ్రాహ్మణి తరపున కుటుంబసభ్యులు టీటీడీ అధికారులకు అందజేశారు.
కాగా, ప్రతి సంవత్సరం పుట్టిన రోజున అన్నప్రసాద వితరణకు విరాళం ఇవ్వడం ఆ కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది. నారా దేవాన్ష్ పేరిట విరాళం ఇచ్చిన నేపథ్యంలో ఆ విషయాన్ని తెలుపుతూ తిరుమలలో శ్రీవారి ఆలయ పరిసరాల్లోని డిస్‌ప్లే బోర్డుల్లో ప్రదర్శించారు.

కాగా, తిరుమల శ్రీవారి భక్తులు తమ కుటుంబసభ్యుల్లో ఎవరిదైనా పుట్టినరోజు లేదా ప్రత్యేకమైన రోజుల్లో టీటీడీ అన్న ప్రసాద వితరణకు ఇలా విరాళాలు ఇస్తుంటారు. కొందరు భక్తులు అన్న ప్రసాదానికి విరాళాన్ని ఇచ్చి తమ మొక్కుల్ని కూడా చెల్లించుకుంటారు. చంద్రబాబు కుటుంబం గతంలో స్వయంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొంది.












Click it and Unblock the Notifications